AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెల్సా? గుడ్డి నమ్మకాలతో కాస్త జాగ్రత్త..

తెల్ల వెల్లుల్లి గురించి అందరికీ తెలుసు. కానీ మీరు నల్ల వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో నలుపు, తెలుపు వెల్లుల్లి అని రెండు రకాలు ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన తెల్ల వెల్లుల్లి బలమైన ఘాటు వాసనతోపాటు..

నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఏది ఆరోగ్యానికి మంచిదో తెల్సా? గుడ్డి నమ్మకాలతో కాస్త జాగ్రత్త..
White Vs Black Garlic
Srilakshmi C
|

Updated on: Dec 23, 2025 | 8:04 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరికీ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోంది. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమమని వంటింటి రుచులపై ఆసక్తి చూపుతున్నారు. కిచెన్‌లో లభించే ఆరోగ్యకరమైన పదార్ధాల్లో వెల్లుల్లి ముందు వరుసరలో ఉంటుంది. అయితే తెల్ల వెల్లుల్లి గురించి అందరికీ తెలుసు. కానీ మీరు నల్ల వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిలో నలుపు, తెలుపు వెల్లుల్లి అని రెండు రకాలు ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన తెల్ల వెల్లుల్లి బలమైన ఘాటు వాసనతోపాటు యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వీటిల్లో ఉండే అల్లిసిన్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు నయమవడంలో ఉపయోగపడుతుందని వైద్యులు అంటున్నారు. అయితే ఈ అల్లిసిన్ కడుపు సంబంధిత రుగ్మతలకు కారణమవుతుంది.

నల్ల వెల్లుల్లిలోని అల్లిసిన్ కిణ్వ ప్రక్రియ ద్వారా మరింత విస్తృతమై సులభంగా శోషించదగిన యాంటీఆక్సిడెంట్‌గా మార్చబడుతుంది. ఇది S-అల్లైల్ సిస్టీన్ (SAC) ప్రత్యేక లక్షణం. నల్ల వెల్లుల్లిలో లభించే SAC పచ్చి వెల్లుల్లిలోచాలా సులభంగా శోషించబడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల కారణంగా చాలా మంది దీనిని తమ ఆహారంలో చేర్చుకుంటారు. తెల్ల వెల్లుల్లి కంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. అందుకే చాలా మంది దీనిని తమ రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉంటారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నల్ల వెల్లుల్లి శోథ నిరోధకమని అంటున్నారు. ఇది మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది గుండె, కాలేయ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు. నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొందరు దీన్ని తీసుకోవడం వల్ల లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు. రక్తం పలచగా ఉన్నవారు దీన్ని తీసుకోవడం అంత మంచిది కాదు. కడుపు నొప్పి వచ్చేవారు కూడా నల్ల వెల్లుల్లిని నివారించాలి. ఇది ట్రెండీగా ఉండటం వల్ల యాదృచ్ఛికంగా దీన్ని ఆహారంలో చేర్చుకుంటే సమస్యల్లో చిక్కుకుంటారు. అందుకే దీన్ని ఆహారంలో తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
గంభీర్ ఎఫెక్ట్‌తో పాన్‌వాలా కొడుకు కెరీర్‌ క్లోజ్..
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
ఐదు జిల్లాల్లో యూరియా యాప్‌ అమలు విజయవంతం
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..