అర్థరైటీస్ సమస్య ఉన్నవారు అస్సలే తీసుకోకూడని ఆహారాలు ఇవే!

Samatha

23 December 2025

ఈ మధ్య కాలంలో చాలా మంది అర్థరైటీస్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారపదార్థాలు అస్సలే తినకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు అస్సలే చిప్స్, లాంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు తినకూడదంట. ఇవి తినడం వలన సమస్య మరింత తీవ్రతరం అవుతుంది.

అదే విధంగా, ఎర్ర మాంసం తినడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన సమస్య పెరుగుతుందంట.

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అయినా అందరూ ఎక్కువగా తాగుతుంటారు. అయితే అర్థరైటిస్ ఉన్నవారు పొరపాటున కూడా మద్యం సేవించకూడదంట.

అదే విధంగా వేయించిన ఆహారాలు తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కీళ్ల నొప్పులతో బాధపడే వారు వీటిని తినకూడదు.

అలాగే ఎక్కువ పప్పులు, యూరిక్ యాసిడ్ పెంచేవాటిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.

వీలైనంత వరకు అర్థరైటిస్ సమస్యతో బాధపడే వారు సమతుల్య ఆహారం తీసుకోవాలంట. తమ డైట్‌లో మంచి ఫైబర్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.

మరీ ముఖ్యంగా ఆకు కూరలు, మంచి కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు