AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..

ఈ ఏడాది శీతాకాలం దడ పుట్టిస్తుంది. గరిష్ట స్థాయిలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి మనం సహజంగానే ముఖంతో సహా ఒళ్లంతా దుప్పటితో కప్పుకుని నిద్రపోతాం. ఇది ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఇటీవలి పరిశోధనల ప్రకారం...

చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా..
Sleep With A Blanket Over Head In Winter
Srilakshmi C
|

Updated on: Dec 23, 2025 | 8:46 PM

Share

ఈ ఏడాది శీతాకాలం దడ పుట్టిస్తుంది. గరిష్ట స్థాయిలో చలి రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి మనం సహజంగానే ముఖంతో సహా ఒళ్లంతా దుప్పటితో కప్పుకుని నిద్రపోతాం. ఇది ఉష్ణోగ్రతను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ ఇటీవలి పరిశోధనల ప్రకారం ఈ రకమైన అభ్యాసం శ్వాసకోశ వ్యవస్థపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తుందని తేలింది. రాత్రిపూట ముఖాన్ని కప్పుకోవడం వల్ల శ్వాస, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించారు. కాబట్టి ఇది ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

నిద్రపోయేటప్పుడు మన ముఖాన్ని దుప్పటి లేదా బెడ్ షీట్ తో కప్పుకోవడం వల్ల మనం పీల్చే గాలి (కార్బన్ డయాక్సైడ్) అక్కడే చిక్కుకుపోయి బయటకు కోవడానికి స్థలం లేకుండా పోతుంది. ఫలితంగా మనం తెలియకుండానే కార్బన్ డయాక్సైడ్ ను పదే పదే పీల్చుకుంటాం. ఇది శరీరానికి లభించే తాజా ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది ఉదయం నిద్రలేచినప్పుడు తలనొప్పి, రోజంతా అలసిపోయినట్లు అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం, నిద్రలో తరచుగా మేల్కొవంటి వంటి సమస్యలకు దారితీస్తుంది. అంతేకాకుండా ముఖాన్ని కప్పుకోవడం వల్ల ఆ ప్రాంతంలో తేమ, చెమట పేరుకుపోతుంది. దుప్పటిపై ఉన్న దుమ్ము, బ్యాక్టీరియా కూడా చర్మంలోకి రావచ్చు. ఇది మొటిమలు, వాపు వంటి సమస్యలకు దారితీస్తుంది. నిద్రలో శరీర ఉష్ణోగ్రత పెరుగుదల నిద్రకు అంతరాయం కలిగిస్తుంది.

ముఖాన్ని దుప్పటితో కప్పుకుని నిద్రపోవడం ఎవరికి ఎక్కువ ప్రమాదమంటే..

ఉబ్బసం, సైనస్, అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ముఖ్యంగా శిశువులకు ఈ అలవాటు చాలా ప్రమాదకరం.

ఇవి కూడా చదవండి

తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • ఎల్లప్పుడూ మీ భుజాల వరకు మాత్రమే దుప్పటి లేదా బెడ్ షీట్‌ కప్పుకోవడం అలవాటు చేసుకోవాలి.
  • వెచ్చగా ఉండటానికి మందపాటి దుస్తులు లేదా సాక్స్ ధరించాలి.
  • కాటన్ బెడ్డింగ్ వాడాలి.
  • మీరు వెలుతురు లేకుండా చీకటిలో ఉండాలనుకుంటే ముఖం మీద దుప్పటి లేదా బెడ్ షీట్ వేసుకునే బదులు కంటికి మాస్క్ ధరించాలి.
  • మీ పాదాల దగ్గర వేడి నీటి సీసాలు ఉంచుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
చలిగా ఉందని కాళ్ల నుంచి తల వరకు మొత్తం దుప్పటితో కప్పేస్తున్నారా?
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
మీకు ఆదాయపు పన్ను నుండి ఇలాంటి సందేశాలు వస్తున్నాయా? జాగ్రత్త!
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
ధనుష్కోడి మహా విషాదానికి 59 ఏళ్లు.. ఆ రైలు ఏమైంది?
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
సులువుగా బరువు తగ్గాలా? ఐతే ఉదయాన్నే ఈ 4 పనులు చేయండి..
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
విజయ్ హజారేలో కోహ్లీ, రోహిత్ పారితోషికం ఎంతో తెలుసా?
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
మార్కెట్లో సంచలన సృష్టించనున్న మరో రియల్‌మీ ఫోన్‌.. 200MP కెమెరా!
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేయనున్న పాకిస్తాన్
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
గూగుల్ పే నుంచి మొదటి క్రెడిట్ కార్డు.. యుపిఐ ద్వారా చెల్లింపులు
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? ప్రగతి రియాక్షన్ ఇదే
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?
నల్ల వెల్లుల్లి Vs తెల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?