AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్.. ‘ధురంధర్’ సినిమాలో ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించాల్సింది.. కానీ..

ఈ ఏడాది మన దేశంలో రిలీజైన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ధురంధర్. ఇప్పటికే రూ. 850 కోట్లను దాటేసిన ఈ మూవీ రూ.1000 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది. అయితే ఈ బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా నటించాల్సింది.. కానీ..

Dhurandhar Movie: గోల్డెన్ ఛాన్స్ మిస్.. 'ధురంధర్' సినిమాలో ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటించాల్సింది.. కానీ..
Dhurandhar Movie
Basha Shek
|

Updated on: Dec 23, 2025 | 10:18 PM

Share

రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. రిలీజ్ కు ముందే నెగెటివ్ కామెంట్స్ బారిన పడిన ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది ధురంధర్ మూవీ. ఇప్పటికే రూ. 850 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ స్పై థ్రిల్లర్ రూ.1000 కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఆధిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ లాంటి టాప్ స్టార్స్ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరితో పాటు ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ ప్రియురాలిగా ఒకప్పటి ఛైల్డ్ ఆర్టిస్ట్ నాన్న మూవీ ఫేమ్ సారా అర్జున్ కథానాయికగా నటించింది. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించాల్సింది. కానీ ఒకే ఒక్క రీజన్ తో ఆమెకు ఈ మూవీలో ఛాన్స్ మిస్ అయ్యింది.

ధురంధర్ సినిమాలో షరరాత్ అంటూ సాగే ఓ స్పెషల్ సాంగ్ ఉంది. హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఇందులో ఆయేషా ఖాన్, క్రిస్టల్ స్టెప్పలేశారు.  అయితే మొదట ఈ స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను అనుకున్నారట. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 తదితర సినిమాల్లో మిల్కీ బ్యూటీ చేసిన స్పెషల్ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. దీంతో తమన్నాతోనే షరారత్ సాంగ్ చేయించాలని కొరియోగ్రాఫర్   విజయ్ గంగూలీ అనుకున్నాడట.  అయితే డైరెక్టర్ ఆధిత్య ధర్ మాత్రం ఇందుకు ఒప్పుకోలేదట.  ఈ విషయాన్ని స్వయంగా కొరియోగ్రాఫరే చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

తమన్నా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

‘ఈ పాటకు సంబంధించి నా మైండ్‌లో తమన్నా పేరు మాత్రమే ఉంది. ఆమె అయితేనే పాటకు సరైన న్యాయం చేస్తుందని ఆదిత్యకు చెప్పాను. కానీ ఆయన ఫుల్ క్లారిటీతో ఉ‍న్నారు. ఇది రెగ్యులర్ స్పెషల్ సాంగ్‌లా ఉండకూడదని చెప్పేశారు. సినిమా కథని డిస్టర్బ్ చేసేలా ఏ ఒక్క అంశం కూడా ఉండకూడదనేది ఆదిత్య ధర్ ఉద్దేశం. ఒకవేళ ఈ పాటలో తమన్నా ఉంటే అందరి దృష్టి ఆమెపైనే ఉంటుంది తప్ప స్టోరీపై ఉండేది కాదని మా అభిప్రాయం. ‘ అని విజయ్ చెప్పుకొచ్చారు.

ధురంధర్ సినిమా స్పెషల్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు