Ice bath Benefits: ఐస్ బాత్ తో ఈ సమస్యలకు చెక్.? సెలబ్రిటీల పోస్ట్‌లతో ట్రెండింగ్‌లోకి ఐస్‌బాత్‌.

సాధారణంగా వెదర్ కాస్త చల్లగా ఉన్నప్పుడే చన్నీటి స్నానం చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. బాత్ టబ్ నిండా ఐస్ ముక్కలు వేసి అందులో కూర్చోని స్నానం చేయడం అంటే మాటలా? అంటూ కొందరంటున్నా ఐస్ బాత్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. నటి సమంత ఐస్ బాత్ కు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ బాత్‌ క్రమంగా ట్రెండ్‌ అవుతోంది.

Ice bath Benefits: ఐస్ బాత్ తో ఈ సమస్యలకు చెక్.? సెలబ్రిటీల పోస్ట్‌లతో ట్రెండింగ్‌లోకి ఐస్‌బాత్‌.

|

Updated on: Apr 06, 2024 | 8:45 PM

సాధారణంగా వెదర్ కాస్త చల్లగా ఉన్నప్పుడే చన్నీటి స్నానం చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. బాత్ టబ్ నిండా ఐస్ ముక్కలు వేసి అందులో కూర్చోని స్నానం చేయడం అంటే మాటలా? అంటూ కొందరంటున్నా ఐస్ బాత్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. నటి సమంత ఐస్ బాత్ కు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ బాత్‌ క్రమంగా ట్రెండ్‌ అవుతోంది. ఐస్ బాత్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుందని, శక్తిని పెంచుతుందని, వెయిట్ లాస్ అవుతారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత ? నిపుణులు ఏమని చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. బాత్ టబ్ నిండా ఐస్ ముక్కలు వేసి.. అందులో కూర్చోని స్నానం చేయడం వల్ల మానసిక ఆందోళన, భయం, ఒంటి నొప్పులు, వాపులు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఐస్ బాత్ చేయడం వల్ల అప్పటివరకూ గందరగోళంగా ఉన్న ఆలోచనలన్నీ ఎగిరిపోయి స్పష్టత వస్తుంది. కేవలం మీరు స్నానం మీదనే మీ ఏకాగ్రతను నిలపడంతో దీని వల్ల మీ మెదడుకు, శరీరానికి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. బ్రెయిన్‌లోని నరాలు కూడా ఉత్తేజితం అవుతాయనీ అంటున్నారు.

ఐస్ బాత్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ వల్ల పలు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే చర్మం కూడా కాంతి వంతంగా మారుతుంది. ఐస్ బాత్ చేయడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్య తగ్గుతుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఐస్ బాత్ చేయడం వల్ల ఆక్సిజన్ సరఫరా కూడా బాగా జరుగుతుంది. దీంతో క్రమంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఐస్ పడని వారు మాత్రం ఈ ఐస్ బాత్ అస్సలు చేయకూడదు. మేం అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీరు మీ వైద్య నిపుణులను సంప్రదించడం మరచిపోకండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us