Cyber criminals: ఓటీపీ, పాస్‌వర్డ్‌ చెప్పమంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.? ఓటీపీ తో జాగ్రత్త.!

రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనిషి జీవనాన్ని ఎంతో సులభతరం చేసేస్తోంది. మొబైల్‌ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాం. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో సాధించుకుంటున్నాం. షాపింగ్‌ చేయాలన్నా, బ్యాంకు లావాదేవీలు జరపాలన్నా ఒక్క క్లిక్‌.. ఓటీపీ, పాస్‌వర్డ్‌తో క్షణాల్లో పనులు పూర్తి చేసుకుంటున్నాం. అయితే, ఆ క్లిక్‌నే ఆయుధంగా చేసుకొని వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు.

Cyber criminals: ఓటీపీ, పాస్‌వర్డ్‌ చెప్పమంటూ మెసేజ్‌లు వస్తున్నాయా.? ఓటీపీ తో జాగ్రత్త.!

|

Updated on: Apr 06, 2024 | 9:15 PM

రోజు రోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మనిషి జీవనాన్ని ఎంతో సులభతరం చేసేస్తోంది. మొబైల్‌ చేతిలో ఉంటే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాం. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో సాధించుకుంటున్నాం. షాపింగ్‌ చేయాలన్నా, బ్యాంకు లావాదేవీలు జరపాలన్నా ఒక్క క్లిక్‌.. ఓటీపీ, పాస్‌వర్డ్‌తో క్షణాల్లో పనులు పూర్తి చేసుకుంటున్నాం. అయితే, ఆ క్లిక్‌నే ఆయుధంగా చేసుకొని వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు సైబర్‌ నేరగాళ్లు. బ్యాంకులు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, కొరియర్‌ సంస్థల పేర్లు చెప్పి, ఫోన్‌ చేసి, మెసేజ్‌లు పెట్టి, ఓటీపీ నెంబర్‌ చెప్పమని, పాస్‌వర్డ్‌ చెప్పమని కోరుతూ మాయమాటలతో వినియోగదారుల ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ఫోన్‌ కాల్‌ లేదా సందేశం వచ్చి, మీ ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతుంటే ఒక్కసారి ఆలోచించండి. బ్యాంకులు, బీమా సంస్థలు, ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఇతర ఆర్థిక సంస్థలు ఏవీ కూడా.. ఎప్పుడూ మీ ఓటీపీని అడగవని గుర్తించండి. కొరియర్‌లో వచ్చిన వస్తువులను మనకు ఇచ్చేటప్పుడు వచ్చిన వ్యక్తి ఓటీపీని పంపించాం, చెప్పండి అని అడుగుతారు. అంతేకానీ, ఫోన్‌లోనే ఓటీపీలను అడగరు అని గుర్తుంచుకోండి. ఇటీవలి కాలంలో కొరియర్‌ డెలివరీల పేరు చెప్పి, మోసం చేస్తున్న సంఘటనలు బాగా పెరిగాయి.

మీరు ఎలాంటి లావాదేవీ జరపకుండానే మీకు ఒటీపి వచ్చినట్టయితే కచ్ఛితంగా అది మోసమే.. ఏదైనా ఓటీపీ వచ్చిన వెంటనే స్వయంగా మీరే ఓటీపీ లావాదేవీని నిర్వహించారా? లేదా ఓటీపీ ఏదైనా విశ్వసనీయ సంస్థ నుంచే వచ్చిందా? మీకు వచ్చిన మెసేజ్‌లో ఏదైనా ఒత్తిడి, అత్యవసరం అని కనిపిస్తోందా? చెక్‌చేసుకోవాలి. మీకు వచ్చే ఫోన్‌ కాల్‌ లేదా మెసేజ్‌లో వాడిన భాషను నిశితంగా పరిశీలించండి. మీరు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండానే ఓటీపీ వచ్చిందంటే.. అది కచ్చితంగా మోసపూరితమేనని గుర్తించండి. ఓటీపీని ఎవరికీ చెప్పొద్దు అని బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు చెబుతూనే ఉంటాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
Latest Articles