AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థుల్లో 36% మందికి నో జాబ్స్.!

IIT Bombay: ఐఐటీ బాంబే విద్యార్థుల్లో 36% మందికి నో జాబ్స్.!

Anil kumar poka
|

Updated on: Apr 05, 2024 | 10:03 PM

Share

వరుసపెట్టి లేఆఫ్స్ ప్రకటిస్తున్న కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాలకూ వెనకాడుతుండటంతో జాబ్ మార్కెట్‌లో నిరాశాజనక వాతావరణం నెలకొంది. నిత్యం 100 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ సాధించే ఐఐటీలు, ఐఐఎమ్‌ల్లో కూడా విద్యార్థులు జాబ్స్ విషయంలో సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఐఐటీ బాంబేలో ఈసారి నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగాలు రాలేదని తెలుస్తోంది.

వరుసపెట్టి లేఆఫ్స్ ప్రకటిస్తున్న కార్పొరేట్ కంపెనీలు కొత్త నియామకాలకూ వెనకాడుతుండటంతో జాబ్ మార్కెట్‌లో నిరాశాజనక వాతావరణం నెలకొంది. నిత్యం 100 శాతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ సాధించే ఐఐటీలు, ఐఐఎమ్‌ల్లో కూడా విద్యార్థులు జాబ్స్ విషయంలో సందిగ్ధ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఐఐటీ బాంబేలో ఈసారి నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 36 శాతం మందికి ఉద్యోగాలు రాలేదని తెలుస్తోంది. 2024 క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కోసం ఈసారి 2 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 36 శాతం మంది.. అంటే 712 మందికి ఉద్యోగాలు రాక నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ప్లేస్‌మెంట్స్ పరంగా 2021, 2022 సంత్సరాల్లో ఐఐటీ బాంబే దేశవ్యాప్తంగా మూడో ర్యాంకులో సాధించింది. గతేడాది నాలుగో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా ఎదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ కోసం కంపెనీలు రావడం కష్టంగా మారిందని ఐఐటీ బాంబే ప్లేస్‌మెంట్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. ముందస్తుగా నిర్ణయించిన అధిక శాలరీ ప్యాకేజీలకు అనేక కంపెనీలు సుముఖంగా లేవని చెప్పారు.

సాధారణంగా 100 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండే కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ బ్రాంచీలలో ఈ ఏడాది తొలిసారి విద్యార్థులందరికీ ఉద్యోగాలు రాలేదని అన్నారు. విద్యార్థులకు మంచి శాలరీ ప్యాకేజీల కోసం ఐఐటీలు ప్రయత్నిస్తుండగా కంపెనీలు మాత్రం విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ఈ శాలరీలు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగూణంగా లేవని చెబుతున్నాయి. తొలి దశ నియామకాల సందర్భంగా డిసెంబర్‌లో 85 మంది విద్యార్థులకు కోటికి పైగా శాలరీతో ఆఫర్స్ వచ్చాయని ఐఐటీ ప్రకటించింది. కానీ ఆ తరువాత సవరించిన సమాచారాన్ని వెల్లడించిన అధికారులు 22 మందికే కోటి రూపాయలకు పైగా శాలరీ ఉన్న జాబ్ ఆఫర్స్ వచ్చాయని పేర్కొంది. ఈసారి క్యాంపస్ నియామకాలు మే నెల చివరి వరకూ కొనసాగనుంది. ప్లేస్‌మెంట్స్‌ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నా విద్యార్థులకు మాత్రం సందిగ్ధ పరిస్థితులు తప్పట్లేదు. అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలవైపు మళ్లుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..