INDW vs SLW 2nd T20I: షెఫాలీ తుఫాన్ హాఫ్ సెంచరీ.. రెండో టీ20లోనూ టీమిండియాదే విజయం..
India Women vs Sri Lanka Women, 2nd T20I: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో, సిరీస్‌లో టీం ఇండియా 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో షఫాలీ వర్మ తుఫాను ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది.

భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగాంగ రెండవ మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జరిగింది. భారత జట్టు ఈ మ్యాచ్‌ను ఏకపక్షంగా గెలిచి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో, యువ విధ్వంసక బ్యాటర్ షఫాలి వర్మ జట్టుకు మ్యాచ్ విజేతగా నిరూపించుకుంది. ఆమె తుఫాను హాఫ్ సెంచరీతో భారత జట్టును విజయపథంలో నడిపించింది. అదే సమయంలో, బౌలింగ్‌లో వైష్ణవి శర్మ, శ్రీ చరణి , క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా తమదైన ముద్ర వేశారు.
తడబడ్డ లంక..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. హర్షిత సమరవిక్రమ (33), కెప్టెన్ చమరి ఆటపట్టు (31) మినహా మిగిలిన వారు ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (2/31), శ్రీ చరణి (2/23) తలా రెండు వికెట్లు తీయగా, స్నేహ రాణా (1/11), క్రాంతి గౌడ్ (1/21) పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్లు పడగొట్టారు.
షఫాలీ వర్మ విధ్వంసం..
129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చింది. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన షఫాలీ, శ్రీలంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టింది.
ఓపెనర్ స్మృతి మంధాన (14) త్వరగానే అవుట్ అయినప్పటికీ, షఫాలీ, జెమిమా అందించిన వేగం వల్ల భారత్ కేవలం 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసి విజయం సాధించింది. వర్మ 34 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. ఇందులో 11 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. జెమియా 26 పరుగులు, కౌర్ 10 పరుగులు, మంధాన 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
ఈ విజయంతో భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండు విజయాలతో టీమ్ ఇండియా మంచి ఊపులో ఉంది. మూడో టీ20 డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది.
4⃣,6⃣,4⃣
🎥 Shafali Verma’s power on full display in the chase 💪
Updates ▶️ https://t.co/Umn9ZGAexw#TeamIndia | #INDvSL | @TheShafaliVerma | @IDFCFIRSTBank pic.twitter.com/7RkmQlWX8B
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
భారత్ తుది జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, అరుంధతి రెడ్డి, క్రాంతి గౌడ్, వైష్ణవి శర్మ, శ్రీ చరణి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




