AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KR Nagaraju: నాడు ఐపీఎస్ అధికారి.. నేడు ఎమ్మెల్యే.. ఖాకీ డ్రెస్ వదిలి, ఖద్దర్ చొక్కా వేసుకున్న నాగరాజు

పోలీసు ఉద్యోగానికి స్వస్తి పలికి చట్టసభల్లో అడుగుపెట్టాలని తహతహలాడిన వారు ఎంతోమంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రజాప్రతినిధి కావాలనే తాపత్రయంతో పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. కానీ అలాంటి పోలీస్ అధికారులు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసి గెలిచినవారు చాలా అరదు. అందులోనూ ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే చరిత్రే..!

KR Nagaraju: నాడు ఐపీఎస్ అధికారి.. నేడు ఎమ్మెల్యే.. ఖాకీ డ్రెస్ వదిలి, ఖద్దర్ చొక్కా వేసుకున్న నాగరాజు
Kr Nagaraju
Balaraju Goud
|

Updated on: Dec 14, 2023 | 3:28 PM

Share

నాడు ఐపీఎస్ అధికారి. నేడు ఎమ్మెల్యే. ఖాకీ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందగానే అనూహ్యంగా ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు.. ఆ జిల్లాలో కీలక నేతగా మారిన ఆయన, ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఇంతకీ ఎవరు ఆ పోలీస్ ప్రజాప్రతినిధి..!

పోలీసు ఉద్యోగానికి స్వస్తి పలికి చట్టసభల్లో అడుగుపెట్టాలని తహతహలాడిన వారు ఎంతోమంది ఉన్నారు. పదవీ విరమణ పొందిన వారు కూడా ప్రజాప్రతినిధి కావాలనే తాపత్రయంతో పరుగులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. కానీ అలాంటి పోలీస్ అధికారులు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేసి గెలిచినవారు చాలా అరదు. అందులోనూ ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎమ్మెల్యేగా గెలుపొందడం అంటే చరిత్రే..!

వరంగల్ జిల్లా వర్దన్నపేట MLA కే.అర్ నాగరాజు ఇప్పుడు జనంలో చర్చగా మారాడు. IPS ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన వెంటనే ప్రజల చేత ఎన్నుకోబడి MLA అయ్యాడు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా పదవీ విరమణ పొందిన వెంటనే ఖాకీ డ్రెస్ వదిలి, ఖద్దర్ చొక్కా వేశాడు. ఇంకేముంది ఆయనకు వర్ధన్నపేట నుండి కాంగ్రెస్ టికెట్ లభించింది. వర్ధన్నపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్‌పై బంపర్ మెజార్టీతో గెలిచిన కేఆర్ నాగరాజు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టాడు..

హనుమకొండ కు చెందిన కే అర్ నాగరాజు 1989లో సబ్ ఇన్స్పెక్టర్‌గా పోలీస్ ఉద్యోగంలో చేరారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ముఖ్యంగా అత్యధికంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, నిజామాబాద్ సిటీ పోలిస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఈ క్రమంలోనే 2023 మార్చి నెలలో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత ఖాకీ డ్రెస్ తీసేసి ఖద్దర్ చొక్కా వేసుకున్న నాగరాజు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్దన్నపేట SC రిజర్వుడ్ నియోజక వర్గం నుండి బరిలోకి దింపింది.

ఈ నియోకవర్గానికి చెందిన బలమైన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై 20,020 ఓట్ల మెజారిటీతో గెలుపొంది రికార్డ్ సృష్టించాడు. మొన్నటి వరకు ఖాకీ పోలిస్ యూనిఫామ్తో క్రమశిక్షణ కలిగిన పోలిస్ అధికారిగా విధులు నిర్వర్తించిన నాగరాజు, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా తన మార్క్ చూపుతున్నారు. పోలిస్ అధికారిగా సక్సెస్ సాధించిన ఆయన, పొలిటికల్ లీడర్ గా MLAగా ఎలాంటి మార్క్ చూపిస్తారో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..