AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్‌.. ఆ తర్వాత ఎక్కడికి వెళతారంటే..?

KCR Health Updates: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడిన ఘటనలో తుంటి ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స చికిత్స చేశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు.

KCR: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న కేసీఆర్‌.. ఆ తర్వాత ఎక్కడికి వెళతారంటే..?
KCR
Shaik Madar Saheb
|

Updated on: Dec 14, 2023 | 3:02 PM

Share

KCR Health Updates: బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడిన ఘటనలో తుంటి ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స చికిత్స చేశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. రేపు (డిసెంబర్ 15) ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.

తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకను రిప్లేస్‌ చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని కోరారు.

కేసీఆర్‌ అభ్యర్థన మేరకు కొద్ది రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తగ్గిన అభిమానుల తాకిడి ఇప్పుడు నందీనగర్‌లోని ఆయన నివాస వద్ద పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు కోలుకొని తమ మధ్యకు వస్తారా అని కార్యకర్తలు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు