AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్! ఎప్పుడంటే?

నగర వాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ కీలక ప్రకటన జారీ చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో 18 గంటల పాటు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని పేర్కొంది. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది. కాబట్టి ఏ ప్రాంతాల్లో నీటి సరఫరా అగనుందో తెలుసుకుందాం.

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్! ఎప్పుడంటే?
Hyderabad Water Supply Cut 2026
Anand T
|

Updated on: Jan 01, 2026 | 6:30 PM

Share

హైదరాబాద్ మహానగరానికి ప్రధానంగా మంజీరా, సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీ మొత్తం త్రాగునీరు సరఫరా జరుగుతుంది. అయితే సింగూర్ ప్రాజెక్టులో పెద్దపూర్ నుంచి సింగపూర్ వరకు ఉన్న 1,600 MM డయా ఫేజ్ – 3 మెయిన్ పైప్‌లైన్‌లో భారీ లీకేజీలు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. దీంతో అత్యవసర మరమ్మత్తు పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీనితో పాటు, టిఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో 132కేవీ కంది సబ్‌స్టేషన్ వద్ద పెద్దపూర్ ఫీడర్‌కు సంబంధించి ఏంఆర్ టి టెస్టింగ్, హాట్ లైన్ రిమార్క్స్ లతో పాటు సాధారణ నిర్వహణ పనులు నిర్వహించనున్నారు. ఈ పనులు 03.01.2026, శనివారం ఉదయం 10 గంటల నుంచి తేదీ 04.01.2026 తెల్లవారుజామున 4 గంటలకు చేపడతారు.

ఈ కారణంగా నగరంలోని క్రింది పేర్కొన్న ప్రాంతాలకు సూచించిన తేదీలలో 18 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయబడుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం

  •  ఓ అండ్ ఎం డివిజన్ 15 : మలేషియన్ టౌన్‌షిప్, మాదాపూర్, కొండాపూర్, డోయెన్స్ సెక్షన్, మాదాపూర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB). ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
  •  ఓ అండ్ ఎం డివిజన్ 9 : భరత్ నగర్, మూసాపేట సెక్షన్, గాయత్రీ నగర్ సెక్షన్, బాలానగర్ సెక్షన్, కేపిహెచ్ బి కొంత భాగం, బాలాజీ నగర్ సెక్షన్ కొంత భాగం.
  •  ఓ అండ్ ఎం డివిజన్ 6 : ఫతేనగర్.
  •  ఓ అండ్ ఎం డివిజన్ 17 : గోపాల్ నగర్, హఫీజ్‌పేట్ సెక్షన్, మయూరి నగర్, మియాపూర్ సెక్షన్.
  •  ఓ అండ్ ఎం డివిజన్ 22: ప్రగతినగర్ సెక్షన్, మరియు మైటాస్.
  • ​ట్రాన్స్‌మిషన్ డివిజన్ 2: BHEL, MIG-I & II, రైల్ విహార్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, చందానగర్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.