అతిగా తినడం మెదడు పనితీరును దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మధుమేహం, ఊబకాయానికి దారితీసి మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ మెదడులోని రక్తనాళాలను గడ్డకట్టి, రక్త సరఫరాను తగ్గిస్తుంది. ఇది మెదడు పనితీరును తీవ్రంగా దెబ్బకొడుతుంది. కనుక పరిమితంగా ఆహారం తీసుకోవడం అత్యవసరం.