AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తమ జీవితాల్ని తీర్చిదిద్దిన గురువకు అపూర్వ వీడ్కోలు..

ఎవరైనా జీవితంలో స్థిరపడాలంటే.. ముగ్గురు కారణమవుతారు. వారిలో మొదటి ఇద్దరు తల్లిదండ్రులు అయితే మూడోది వ్యక్తి గురువు అందుకే గురుదేవోభవ అంటారు. విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడికి విద్యార్థులు ఘనమైన వీడ్కోలు పలికారు. ..

Telangana: తమ జీవితాల్ని తీర్చిదిద్దిన గురువకు అపూర్వ వీడ్కోలు..
Emotional Farewell
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 01, 2026 | 6:16 PM

Share

యాదాద్రి జిల్లా అడ్డ గూడూరు మండలం వెల్దేవికి చెందిన తీపిరెడ్డి గోపాల్ రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పని చేశారు. ఆ తర్వాత ఫిజికల్ డైరెక్టర్, ప్రధానోపాధ్యాయుడిగా, ఎంఈఓగా మొత్తం 40 ఏళ్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఎంతమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా కాకుండానే జీవిత పాఠాలను బోధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతికి దోహదపడ్డారు. మోత్కూర్ లో తీపిరెడ్డి గోపాల్ రెడ్డి పదవీ విరమణ చేశారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన గురువు గోపాల్ రెడ్డి దంపతులను.. శిష్యులు, విద్యార్థులు కారులో ఎక్కించుకుని.. వాహనాన్ని తాళ్లతో లాగుతూ పాఠశాల గేటు నుంచి సన్మాన వేదిక వద్దకు తీసుకువచ్చి తమ అభిమానాన్ని ఇలా చాటారు. జీవితంలో అజ్ఞాన చీకట్లను తొలగించి వెలుగుల వైపు నడిపించిన గురువును పూల వర్షంతో సత్కరించి విద్యార్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవి విరమణ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొని ఘనంగా సన్మానించడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు గోపాల్ రెడ్డి చెప్పారు. తన శిష్యుల విద్యార్థులు తనకు వీడ్కోలు పలకడం.. ఎంతో సంతోషాన్నిచ్చిందనీ గోపాల్ రెడ్డి అన్నారు.