AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. డస్సాల్ట్ ఏవియేషన్‌తో కీలక ఒప్పందం

తెలంగాణ రైజింగ్ నినాదం ఫలితాలను ఇస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. తాజాగా మరో రెండు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. మరి ఏ రంగాల్లో రెండు కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి?. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.

Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. డస్సాల్ట్ ఏవియేషన్‌తో కీలక ఒప్పందం
Rafale
Ravi Kiran
|

Updated on: Jun 06, 2025 | 7:11 AM

Share

తెలంగాణ బిగ్ అచీవ్‌మెంట్ సాధించింది. నిన్న హ్యుందయ్‌, ఇవాళ రఫెల్‌తో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాఫెల్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాలు తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… ప్రపంచ మార్కెట్‌ల కోసం రాఫెల్ ఫైటర్ జెట్‌ల ఫ్యూజ్‌లేజ్‌ను ఇకపై హైదరాబాద్‌లో ఉత్పత్తి చేయనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్‌లేజ్‌లను ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ హైదరాబాద్‌లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాల తయారీ కోసం ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో.. వెనుక ఫ్యూజ్‌లేజ్ పార్శ్వషెల్స్‌తో సహా పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్‌లేజ్, ముందు భాగం ఉండనున్నాయి. ఇవి రాఫెల్ యుద్ద మిమానాలలో కీలక భాగాలు. మొదటి ఫ్యూజ్‌లేజ్.. 2028 ఆర్థిక సంవత్సరంలో అసెంబుల్ పూర్తి చేసుకుని బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడి నుంచి నెలకు రెండు పూర్తి ఫ్యూజ్‌లేజ్‌లను తయారవుతాయని అంచనా వేస్తున్నారు.

దక్షిణ కొరియా ఆటోమోటివ్‌ దిగ్గజం ‘హ్యుందాయ్‌ కార్ల మెగా టెస్ట్‌ సెంటర్‌ను తెలంగాణలో స్థాపించనుంది. ఇందులో ఆటోమోటివ్‌ టెస్ట్‌ ట్రాక్‌ సదుపాయంతోపాటు.. ఈవీ సహా.. అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో 675 ఎకరాల్లో సుమారు 8వేల 528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జహీరాబాద్‌ నిమ్జ్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను మాత్రమే స్థాపించాలని హ్యుందాయ్‌ తొలుత భావించినా.. తాజాగా టెస్టింగ్‌ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో.. దాదాపు 4వేల 200 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హ్యుందయ్ కంపెనీ ప్రతినిధులు ఈనెలలోనే రాష్ట్రానికి రానున్నారని, పెట్టుబడులపై ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ పేరుతో.. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలు, దక్షిణ కొరియా యాత్రల ఫలితమే ఈ పెట్టుబడులని అంటోంది ప్రభుత్వం. సియోల్‌లో హ్యుందయ్‌ సీఈఓతో చర్చించడంతోనే 8వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి