AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ వీధిలో అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా

ఆ వీధిలో అదేపనిగా అర్ధరాత్రి కుక్కలు అరుస్తున్నాయ్. ఏంటా అని కొందరు వ్యక్తులు బయటకు వచ్చి టార్చ్ వేసి చూడగా దెబ్బకు దడుసుకున్నారు. ఎదురుగా కనిపించిన సీన్ చూసి షాక్ అయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని గద్వాల్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..

Telangana: ఆ వీధిలో అర్ధరాత్రి అదేపనిగా కుక్కల అరుపులు.. ఏంటా అని వెళ్లి చూడగా
Dogs
Ravi Kiran
|

Updated on: Jun 03, 2025 | 1:55 PM

Share

గద్వాల పట్టణంలోని హమాలీ కాలనీ వాసుల‌ను ఓ భారీ మొసలి హ‌డ‌లెత్తించింది. సోమవారం అర్ధరాత్రి ఇళ్ల మధ్యకు వచ్చిన మొస‌లిని చూసి కుక్కలు గట్టిగా మొరగడంతో.. ఏమై ఉంటుందా అని చూసిన స్థానికులు మొసలిని చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అందరూ కలిసి మొసలిని తాడుతో బంధించి, అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది, స్థానిక జంతు సంరక్షణ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చాకచక్యంగా వ్యవహరించి, మొసలికి ఎలాంటి హాని కలగకుండా, ప్రజలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం ఆ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. హామాలి కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అక్కడినుంచే ముసలి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో మొసళ్ల సంచారం పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు, వరదలు సంభవించినప్పుడు అవి తమ సహజ ఆవాసాల నుంచి బయటకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. నదుల్లో నీటి మట్టాలు పెరగడం లేదా ఆహార వనరులు తగ్గడం వంటి కారణాల వల్ల మొసళ్లు తమ ఆవాసాలను వదిలి బయటకు వస్తుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అటవీ శాఖ అధికారులు మొసళ్లు ఎక్కువగా సంచరించే ప్రాంతాలపై నిఘా పెంచారు. వర్షాకాలం కావడంతో నదులు, నీటి వనరుల సమీపంలో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వన్యప్రాణులు కనిపిస్తే ఎలా స్పందించాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దారి తప్పి వచ్చిన మొసళ్లను సురక్షితంగా పట్టుకుని, వాటి సహజ ఆవాసాలకు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు