Vizag: పాములను పట్టి అడవిలో వదులుదామకున్నాడు.. కట్ చేస్తే.. సంచి ఓపెన్ చేయగా..
వర్షాకాలం కావడంతో పాములు ఆహారం కోసం వెతుక్కుంటూ ఇళ్లలోకి, జనావాసాల్లోకి చొరబడుతూ ఉంటాయి. ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తూ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో రెండు నాగుపాములు కలకలం సృష్టించాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి లుక్కేయండి.

డాక్‌యార్డ్ సమీపంలోని ఓ షాపులో రెండు నాగుపాములు దూరాయి. వాటిని గుర్తించిన షాపు యజమాని స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పాములను పట్టుకొని సంచిలో వేశాడు. రాత్రి చాలా ఆలస్యం అయిపోయేసరికి ఉదయాన్నే అడవిలో వదిలిపెడదామని పాములను సంచిలోనే ఉంచి తన ఇంట్లో భద్రంగా ఉంచాడు. జూన్ 2 సోమవారం ఉదయం పాములను అడవిలో వదిలేందుకు వెళ్లిన అతనికి అక్కడ ఊహించని సీన్ కనిపించింది.
అతడికి ఆ సంచిలో గుడ్లు కనిపించాయి. ఏకంగా రాత్రికి రాత్రే అందులో పాము 12 గుడ్లను పెట్టింది. అనంతరం స్నేక్ క్యాచర్ అటవీ సిబ్బందికి సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అడవి సిబ్బందికి నాగరాజు పాములను, గుడ్లను చూపించాడు. పాము గుడ్లను అడవీ సిబ్బంది జూకి తరలించగా.. స్నేక్ క్యాచర్ పాములను సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..