AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సమావేశం! పూర్తి వివరాలు..

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఇవాళ పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్ డీపీఆర్ పై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రూ.81,000 కోట్లతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఈ సమావేశంలో ఏపీ ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు.

బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక సమావేశం! పూర్తి వివరాలు..
Banakacherla Project
SN Pasha
|

Updated on: Jun 02, 2025 | 1:44 PM

Share

ఇవాళ(సోమవారం, జూన్‌ 2) కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. పోలవరం-బనకచర్ల రివర్ లింక్ ప్రాజెక్ట్‌ డీపీఆర్‌(డిటేయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)పై చర్చిస్తారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రయత్నం ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాజెక్ట్‌తో కలిగి ప్రయోజనాలు వివరిస్తూ డీపీఆర్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్, జలవనరులశాఖ సహాలదారు వెంకటేశ్వరరావు, పోలవరం చీఫ్‌ ఇంజినీర్ నరసింహమూర్తి పాల్గొంటారు.

అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌ను తెలంగాణ వ్యతిరేకిస్తోంది. నిన్నటి సమావేశంలో ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు కూడా. మరోవైపు సముద్రంలోకి వెళ్లే జలాలు మాత్రమే వినియోగించుకుని జనకచర్ల రూపొందించామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో తెలంగాణకు అభ్యంతరమేంటని ఏపీ సీఎం చంద్రబాబు సైతం ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ భేటీపై ఆసక్తి నెలకొన్నది. మరి దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి స్పందన ఇస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి