Warangal: డబ్బు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్‌కు వెళ్లిన వ్యక్తి.. ఓ నోటు చూడగానే ఇలా..
ఓ ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బ్రాందీ షాప్‌కొచ్చారు. మద్యం కొనుగోలు చేశారు. డబ్బులు కూడా ఇచ్చారు. కట్ చేస్తే.. ఆ మద్యం షాప్ యజమాని డబ్బును బ్యాంక్‌లో కట్టేందుకు వెళ్లగా.. అక్కడ క్యాషియర్ చేసిన పనికి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోసమే జరుగుతోంది. నిత్యావసర వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు అన్నింటా మోసాలే జరుగుతున్నాయ్. సరిగ్గా అలాంటి ఘటన ఒకటి వరంగల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పర్వతగిరిలో దొంగ నోట్లు కలకలం రేపాయి. అక్కడి దుర్గశ్రీ వైన్స్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగ నోట్లతో మద్యం కొనుగోలు చేశారు. ఈ డబ్బును బ్యాంక్‌లో జమ చేయడానికి వైన్స్ వాళ్లు వెళ్లగా.. ఒక రూ.500, రూ.100 దొంగ నోట్లను బ్యాంక్ అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, మార్కెట్‌లో దొంగనోట్ల చలామణి అవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

