AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Anveshana: అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్ మళ్లీ చిక్కుల్లో పడ్డాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ బాగోతాన్ని బయట పెట్టి ప్రశంసలు అందుకున్న అతనిపై ఇప్పుడు సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మరి దీనిపై అన్వేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Naa Anveshana:  అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
Youtuber Anvesh
Basha Shek
|

Updated on: May 04, 2025 | 10:02 AM

Share

ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్ యూట్యూబర్. లోకల్ బాయ్ నాని మొదలు మొన్నటి నటుడు అలీ వరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఆధారాలతో సహా వీడియోలు రిలీజ్ చేశాడీ గ్లోబల్ టూరిస్ట్. అదే సమయంలో కొందరు సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు అన్వేష్. ఇప్పుడిదే కారణంతో మరోసారి చిక్కుల్లో పడ్డాడీ ప్రపంచ యాత్రికుడు. తెలంగాణ డీజీపీతో పాటు పలువురు ప్రముఖులపై తప్పుడు వ్యాఖ్యలు చేశాడంటూ అతనిపై కేసు నమోదైంది. బెట్టింగ్‌ యాప్‌ల ప్రచారం పేరుతో.. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు శాంతికుమారి, దాన కిశోర్, వికాస్‌రాజు తదితరులు రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు అన్వేష్. అయితే ఇది అవాస్తవ, తప్పుడు సమాచారమంటూ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

‘ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అధికారులు, చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు.. పరువుకు భంగం కలిగించేలా అన్వేష్ వీడియో ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా.. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ద్వేషాన్ని కలిగించేలా అన్వేష్ అవాస్తవ ప్రకటనలు చేశాడు . తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసేలా వీడియో చేసిన కంటెంట్‌ క్రియేటర్‌ అన్వేష్‌ మీద చర్యలు తీసుకోవాలి’ అని సైబర్‌క్రైమ్‌ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేశారు. దీంతో‌ పోలీసులు అన్వేష్‌పై కేసు నమోదు చేశారు. మరి ఈ కేసు విషయంపై అన్వేష్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

కాగా గత కొన్ని నెలల నుంచి బెట్టింగ్ యాప్‌లపై పోరాటం చేస్తున్నాడు అన్వేష్. ఈ యాప్ లను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోన్న పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను ఆధారాలతో సహా బయట పెట్టాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు కూడా ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న వారిపై కేసులు కూడా నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..