Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అరెరె.. పెద్ద సమస్యే వచ్చిపడిందే.. దాహం వేసిందా ఎలుగుబంటి గారూ

Telangana: అరెరె.. పెద్ద సమస్యే వచ్చిపడిందే.. దాహం వేసిందా ఎలుగుబంటి గారూ

Ram Naramaneni

|

Updated on: May 31, 2025 | 1:30 PM

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం సాకేరా గ్రామంలో వ్యవసాయ బావిలో పడింది ఓ ఎలుగుబంటి.  అడవి నుంచి తప్పిపోయి వచ్చి బావిలో పడిందంటున్నారు స్థానికులు. బావిలో పడ్డ ఎలుగుబంటిని తీసేందుకు గ్రామస్తులు విశ్వప్రయత్నం చేశారు. అటవీ శాఖ అధికారుల సహకారంతో దాన్ని సురక్షితంగా బయటకు తీశారు. 

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సాకేరా గ్రామంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. అడవిలో నుంచి తప్పిపోయిన ఒక ఎలుగుబంటి గ్రామానికి చేరుకుని అనుకోకుండా ఒక వ్యవసాయ బావిలో పడింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఎలుగుబంటిని రక్షించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ సహకారంతో ఎట్టకేలకు దాన్ని గడ్డకు చేర్చారు. బావి లోతైనదిగా ఉండటంతో దాన్ని బయటకు తెచ్చేందుకు 2 గంటలు కష్టపడాల్సి వచ్చింది. మనకెందుకులే అనుకోకుండా గ్రామస్తులు అందరూ కలిసి ఎలుగుబంటిని రక్షించడం అభినందనీయం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..