వందేళ్ల ఛాయ్ కొట్టు.. ఎవరైనా ఛాయ్ చేసుకుని తాగొచ్చు.. మరి డబ్బులు
ఈ టీ స్టాల్‌కు వందేళ్ల చరిత్ర ఉంది. ఏదైనా ఛాయ్ దుకాణం అంటే.. అక్కడ ఉండే టీ మాస్టర్.. ఛాయ్ తయారు చేసి.. కస్టమర్లకు అందిస్తాడు. కానీ ఈ టీ స్టాల్ మాత్రం అన్నింటి కంటే భిన్నం. అక్కడికి వచ్చిన కస్టమర్లే.. టీ తయారు చేసి తాగుతారు. అంతేకాకుండా తర్వాత వచ్చిన వారికి కూడా అందిస్తారు. టీ తాగిన తర్వాత డబ్బులు అక్కడ ఉండే గల్లా పెట్టెలో వేసి వెళ్తారు.
ఇంకో విశేషం ఏంటంటే ఇప్పటివరకు ఎవరూ ఇక్కడ ఉద్దెరకు ఛాయ్ తాగలేదంటే నమ్మండి. ఇంతకీ ఈ టీ స్టాల్ ఎక్కడ ఉంది దాని యజమాని ఎవరు చూద్దాం. పశ్చిమ బెంగాల్‌లోని శ్రీరాంపూర్‌లో దాదాపు 100 ఏళ్లుగా ఈ టీ స్టాల్ నడుస్తోంది. వంద సంవత్సరాల క్రితం నరేష్ చంద్ర షోమ్ అనే స్వాతంత్ర్య సమరయోధుడు ఈ చిన్న టీ దుకాణాన్ని ప్రారంభించారని తెలుస్తోంది. శ్రీరాంపూర్‌లోని ఛత్రా కాళీ బాబు శ్మశానవాటిక ఎదురుగా ఈ టీ స్టాల్ ఉంది. అయితే ఈ టీ స్టాల్ ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ కస్టమర్లు కేవలం టీ తాగడం మాత్రమే కాదు.. వాళ్లే స్వయంగా తయారు చేసుకుంటారు. ఇలా తయారు చేసుకున్న టీని ఇతరులకు కూడా సర్వ్ చేసుకుంటారు. అంటే ఈ టీ స్టాల్‌ను కస్టమర్‌లే నడుపుతున్నారు. ఈ టీ షాప్ ఓనర్ కేవలం ఉదయాన్నే వచ్చి షాప్ ఓపెన్ చేసి వెళ్లి.. చివరికి రాత్రి వచ్చి దాన్ని మూసేసి డబ్బులు తీసుకుని వెళ్తాడు. ఇక రోజంతా ఎవరో ఒకరు ఛాయ్ చేయడం.. తాగడం డబ్బులు అక్కడ పెట్టి వెళ్లడం జరుగుతుంది. ఇక ఈ టీ స్టాల్ ఓనర్ అశోక్ చక్రవర్తి ఎప్పుడూ అక్కడ అందుబాటులో ఉండడు. ఉదయాన్నే వచ్చి ఆయన టీ స్టాల్‌ను ఓపెన్ చేసి.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు వచ్చి మూసేసి వెళ్తాడు. ఇక ఈ టీ స్టాల్‌లో మరో విశేషం ఏంటంటే.. ఛాయ్ తాగిన తర్వాత ఎవరు చూసినా చూడకపోయినా.. అడిగినా అడగకపోయినా.. కస్టమర్లు తమ టీ డబ్బులను క్యాష్‌బాక్స్‌లో వేసి వెళ్తారు. అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ కూడా ఇప్పటివరకు ఎవరూ దొంగిలించడంగానీ.. డబ్బులు చెల్లించకుండా వెళ్లడం జరగలేదని చెబుతున్నారు. ఈ టీ స్టాల్ పూర్తిగా సంప్రదాయం, నమ్మకం అనే రెండు స్తంభాలపైనే గత 100 ఏళ్లుగా నడుస్తోందని పేర్కొంటున్నారు. ఇక ఈ ఛాయ్ దుకాణం చరిత్ర చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సెల్ఫ్ సర్వీస్ అనే పదానికి ఈ టీ స్టాల్ నిదర్శనమని కొనియాడుతున్నారు. ఇక టీ స్టాల్ గురించి తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీరెప్పుడైనా టీని ఇలా వడపోశారా ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
సముద్ర గర్భంలో వింత జీవి రహస్యాన్ని బయటపెట్టిన శాస్త్రవేత్తలు
చీకటిలోనూ చూసేలా చేసే ఐ డ్రాప్స్! శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
