AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shreyas Iyer: వీడేరా గాడ్ ఫాదర్.. 13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు.. దెబ్బకు 11 ఏళ్ల రికార్డు.!

శ్రేయాస్ అయ్యర్.. ఇప్పుడీ పేరు చాలా ఏళ్లు గుర్తుండిపోతుంది. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన ఈ ప్లేయర్.. పంజాబ్ కింగ్స్ జట్టును 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కి చేర్చాడు. ఎన్నో అవమానాల తర్వాత తన సత్తా ఏంటో.? నిరూపించుకున్నాడు అయ్యర్.

Shreyas Iyer: వీడేరా గాడ్ ఫాదర్.. 13 బంతుల్లో మదగజంలా మీదదిపోయాడు.. దెబ్బకు 11 ఏళ్ల రికార్డు.!
Shreyas Iyer
Ravi Kiran
|

Updated on: Jun 02, 2025 | 1:13 PM

Share

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులు చేసి.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టును చిత్తుగా ఓడించాడు. జట్టును ఫైనల్‌కు చేర్చినా.. మ్యాచ్ అనంతరం కెప్టెన్‌లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. దానికి కారణం లేకపోలేదు. ఇన్నింగ్స్ ఒకానొక టైంలో పంజాబ్ ఓడినంత పనైంది. టచ్‌లోకి వచ్చారనుకున్న బ్యాటర్లు అనూహ్యంగా అవుటయ్యారు. అలాంటప్పుడు 17వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్ చాలా నిర్లక్ష్యంగా రనౌట్ అయ్యాడు.

ఇక మ్యాచ్ తర్వాత పంజాబ్ కింగ్స్ డగౌట్ అంతా హ్యాపీగా ఉన్నప్పటికీ.. శ్రేయాస్ అయ్యర్‌కు మాత్రం కోపం తగ్గలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు శశాంక్ రాగానే.. నీ ముఖం నాకు చూపించొద్దు అన్నట్టు అయ్యర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే జట్టుకు వైస్ కెప్టెన్.. పైగా ఇలాంటి కీలక గేమ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అయ్యర్ కోప్పడి ఉంటాడని ఫ్యాన్స్ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కాగా, ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సారి మీరూ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇక క్వాలిఫయర్-2లో ముంబైని ఓడించి పంజాబ్‌ను ఫైనల్ చేర్చడంలో శ్రేయాస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. అటు నెటిజన్లు కూడా ఈ క్రెడిట్ అంతా కెప్టెన్ అయ్యర్‌కు దక్కుతుందని, అతని వీరోచిత పోరాటానికి సెల్యూట్ అంటూ కొనియాడారు. అటు ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లోనూ సైలెంట్‌గా సిక్సులు కొట్టడంపై అయ్యర్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఒత్తిడి పరిస్థితుల్లో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి ఫలితాలు లభిస్తాయి’ అని అతడు చెప్పుకొచ్చాడు.

మరోవైపు క్వాలిఫయర్ 2లో పంజాబ్ జట్టు విజయం అరుదైనదిగా చెప్పొచ్చు. ప్లేఆఫ్స్/నాకౌట్స్‌లో ఇదే హయ్యస్ట్ ఛేజ్. అలాగే మరో ఘటనను కూడా పంజాబ్ సాధించింది. 200+ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక సార్లు(8) చేధించిన జట్టుగా పంజాబ్ రికార్డు సృష్టించింది. ఇక జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా RCB-PBKS మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.