RCB: ఆర్సీబీకి దిమ్మతిరిగే షాక్.. ఐపీఎల్ 2025 ట్రోఫీ వెనక్కి.! ఎందుకంటే
అభిమానుల ఆశ నెరవేరింది. ఎన్నో ఏళ్ల విరాట్ కొహ్లి కల సాకారమైంది. ఎట్టకేలకు ఐపీఎల్ టోర్నీ ఆర్సీబీ సొంతమైంది. ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించి మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీన్ కట్ చేస్తే.!

ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల కలను తెరదించి.. ఆర్సీబీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి.. అద్భుతమైన ఆటతీరుతో ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత బెంగళూరులో భారీ విజయోత్సవ సంబరాలు జరిపింది ఫ్రాంచైజీ. ఇదంతా అలా ఉంచితే.. ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ నుంచి వెనక్కి తీసుకోనున్నారు. దానికి కారణం ఏంటంటే.? ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ఏ జట్టుకైనా.. అసలు ట్రోఫీని ఇవ్వరు. కేవలం ఆ ట్రోఫీ నమూనాను మాత్రమే ఇస్తారు. ఆర్సీబీ కప్పు గెలిచిన అనంతరం.. మొదటిగా ఆ ఫ్రాంచైజీకి అసలు ట్రోఫీని ఇచ్చారు. కానీ ఆపై దాని స్థానంలో నమూనాను ఇచ్చారు. ఆ రిప్లికా ట్రోఫీతోనే బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది.
RCB విజయ పరేడ్..
ఆర్సీబీ విక్టరీకి మద్దతుగా కర్నాటక ప్రభుత్వం సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కర్ణాటక విధాన సభ భవనం దగ్గర ఆర్సీబీ టీమ్‌ను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కర్నాటక గవర్నర్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తోపాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత.. ఆర్సీబీ విక్టరీ పరేడ్.. చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే.. ఒకవైపు కర్ణాటక విధాన సభ భవనం దగ్గర సన్మాన కార్యక్రమం కొనసాగుతుండగానే.. చిన్నస్వామి స్టేడియానికి జనం పోటెత్తారు. స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి.. ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దాంతో.. స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కాగా, ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు కర్ణాటక సీఎం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి