PBKS Vs RCB: ఓడినా వాడు రాజేరా! ఆఖరి వరకు ఆర్సీబీ అభిమానులకు దడ పుట్టించాడుగా
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ ఓటమిపాలైంది. ఇంపార్టెంట్ మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే చివర్లో శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించినా ఏం ప్రయోజనం లేకపోయింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి.. 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. 191 పరుగుల లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. కాస్త తడబడింది. ఫైనల్ మ్యాచ్ ఒత్తిడిని తట్టుకోలేక.. ఆ జట్టు బ్యాటర్లు చేతులెత్తేశారు. చివర్లో మెరుపులు మెరిపించినా.. ఫలితం లేకపోయింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జస్ట్ ఒక్క బంతితో మిస్ అయిందని చెప్పొచ్చు. చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు కావాల్సి ఉండగా.. పంజాబ్ బ్యాటర్ 36 పరుగులు చేశాడు. అలాగే ఆఖరి ఓవర్‌కు 29 పరుగులు కావాల్సి ఉండగా.. మొదటి రెండు డాట్ బాల్స్ మినహా.. మిగిలిన నాలుగు బంతులను బౌండరీలు దాటించేశాడు.
18 ఏళ్ల కల.. అదీ కూడా అనేక ట్రోల్స్‌ను దాటుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఇది కచ్చితంగా ఆ జట్టు మూమెంట్. కానీ చివర్లో మిరాకిల్ చేయబోయిన శశాంక్ సింగ్‌ను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అతడికి ఒక్క బ్యాటర్ హ్యాండ్ ఇచ్చినా.. మ్యాచ్ ముగించేసేవాడు. పంజాబ్ చివరి వరకు పోరాడింది. కానీ సరైన సమయంలో ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో.. చేజేతులా ఓడిపోయింది. చివర్లో శశాంక్ సింగ్ 30 బాల్స్‌లో 61 పరుగులు చేసి పోరాడినా.. ప్రయోజనం లేకపోయింది. ఈ ఓటమితో పంజాబ్ డగౌట్, ఆ ఫ్రాంచైజీ ఓనర్ ప్రీతి జింటాతో పాటు కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా నిరాశలో మునిగిపోయారు.
View this post on Instagram
Your taem needed 42 runs in 2 overs and you loses the match just by 6 runs.
Respect Shashank Singh 🫡 pic.twitter.com/NeeIZIbxWG
— Rahul (@meri_mrziii) June 3, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




