Cyber Crime: ఒక్క మెయిల్‌తో రూ.46 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. అసలేం జరిగిందంటే..
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత రాటు తేలుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని భారీ మోసాలకు
Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు మరింత రాటు తేలుతున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్నారు. జనాల జేబులను కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ కంపెనీ యాజమాన్యానికి భారీ టోకరా వేశారు. ఒక్క మెయిల్‌తో ఏకంగా రూ. 46 లక్షలు కాజేశారు. అది నిజమైన మెయిల్ కాదని, సైబర్ నేరగాళ్ల మాయ అని గుర్తించిన కంపెనీ యాజమాన్యం.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారికి ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బాధితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని సంతోష్ నగర్‌లో గల ‘సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్’ మెడికల్ ఏజెన్సీ(షాప్).. కాలిఫోర్నియోలోని ‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఏడాదిలో మూడు సార్లు ‘ఏజీ సైంటిఫిక్’ నుంచి మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సెన్స్‌కోర్ మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కొన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ అవసరం ఏర్పడటంతో.. ‘ఏజీ సైంటిఫిక్’వారిని సంప్రదించారు ఇక్కడి ఏజెన్సీ వారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వాళ్లు తమ బ్యాంక్ ఖాతాను ప్రతి మూడు నెలలకు మారుస్తుంటారట. దీనిని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు.. పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకున్నారు.
‘ఏజీ సైంటిఫిక్’ కంపెనీలో ‘ఐ’ అనే లెటర్ తీసేసి ఫేక్ మెయిల్ సృష్టించారు. ఆ ఫేక్ మెయిల్‌తో రూ.46లక్షలకు కొటేషన్‌ను పంపి బ్యాంక్ అకౌంట్‌ను కూడా పంచపారు. అయితే, ఏజీ సైంటిఫిక్ వారు బ్యాంక్ అకౌంట్లను మారుస్తుంటారని, ఈ సారి కూడా అలాగే మార్చి ఉంటారని భావించి వాళ్లు అడిగిన రూ.46లక్షలను కేటుగాళ్ల పంపిన అకౌంట్లకు పంపారు. అయితే, ఇదంతా గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకోగా.. తాజాగా మీ డబ్బులు రాలేదంటూ ఏజీ సైంటిఫిక్ వాళ్లు మెయిల్ పెట్టడంతో విషయం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్ల వ్యవహారం అని గుర్తించి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Sonu Sood: రాజకీయ ఎంట్రీ పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే..
Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..