Republic Day 2022: కొవిడ్ ఎఫెక్ట్.. అన్ని చోట్ల ఉదయం 10గంటలకే.. గణతంత్ర వేడుకలపై మార్గదర్శకాలు..

Republic Day 2022: కొవిడ్(Covid 19) మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర(Republic Day 2022) వేడుకల నిర్వహణకు

Republic Day 2022: కొవిడ్ ఎఫెక్ట్.. అన్ని చోట్ల ఉదయం 10గంటలకే.. గణతంత్ర వేడుకలపై మార్గదర్శకాలు..
Republic Day
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 25, 2022 | 9:05 PM

Republic Day 2022: కొవిడ్(Covid 19) మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర(Republic Day 2022) వేడుకల నిర్వహణకు తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనసమ్మర్దం లేకుండా, జనం గుమిగూడకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

వివిధ శాఖాధిపతులు, రాష్ట్రంలో అన్ని ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల వద్ద ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని తెలిపింది. కొవిడ్ నేపథ్యంలో మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం విధిగా చేయాలని శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రాంగణాన్ని శానిటైజ్ చేయాలని అన్న ప్రభుత్వం ఆదేశించింది. 10 గంటలకు ముందు జెండావిష్కరణ చేయొద్దని సూచించారు. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించి వేడుకలు జరపాలని స్పష్టం చేసింది.

Also read:

Sonu Sood: రాజకీయ ఎంట్రీ పై స్పందించిన సోనూసూద్.. ఏమన్నారంటే.. 

Gudivada Casino Politics: గోవా కల్చర్ ఏంటో?.. బీజేపీ నేతకు మంత్రి నాని స్ట్రాంగ్ కౌంటర్..

Padma Awards 2022: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. బిపన్ రావత్‌కు పద్మ విభూషణ్.. తెలుగువారికి పద్మాలు..