ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. కీలక పదవులపై ఆ జిల్లా నేతల ఆశలు..

ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు కీలక పదవులు ఆశిస్తున్నారు. ముదిరాజుల కోటాలో మక్తల్ ఎమ్మెల్యే, దళిత కోటాలో సంపత్ కుమార్‎లు ఆయా పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి అదృష్టం వరించినా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పాలమూరు జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవలే విస్తృత చర్చగా మారిన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు, కెబినెట్ బెర్త్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోరుతున్నారు.

ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. కీలక పదవులపై ఆ జిల్లా నేతల ఆశలు..
Telangana Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Jul 03, 2024 | 11:59 AM

ఒకరు కేబినెట్ బెర్త్, మరొకరు పీసీసీ పగ్గాలు.. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు కీలక పదవులు ఆశిస్తున్నారు. ముదిరాజుల కోటాలో మక్తల్ ఎమ్మెల్యే, దళిత కోటాలో సంపత్ కుమార్‎లు ఆయా పదవుల కోసం పోటీ పడుతున్నారు. అయితే ఎవరికి అదృష్టం వరించినా జిల్లాకు రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పెరుగుతుందని హస్తం క్యాడర్ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు పాలమూరు జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవలే విస్తృత చర్చగా మారిన పీసీసీ అధ్యక్ష బాధ్యతలు, కెబినెట్ బెర్త్ కోసం ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం కోరుతున్నారు. ఇందుకు సామాజిక సమీకరణాలను ముందుంచి పావులు కదుపుతున్నారు. ఒకరు పార్టీలో కీలకంగా ఉండి రాష్ర్ట కాంగ్రెస్ అధ్యక్ష రేసులో ఉంటే.. మరొకరు ఆ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలోనే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడంతో కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నారు. అలంపూరు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పీసీసీ అధ్యక్షుడి పదవిని ఆశిస్తున్నారు. 2014 నుంచి 2018వరకు అలంపూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే 2018 – 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ఇటీవలె జరిగిన ఎంపీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలవాలని భావించారు. కానీ అధిష్టానం మల్లు రవికి టికెట్ కేటాయించింది. అయితే ఈ సారి పీసీసీ పగ్గాల విషయంలో అధిష్టానం సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తున్న నేపథ్యంలో ఎస్సీ కోటాలో తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారట. ఇప్పటికే ఏఐసీసీ సెక్రటరీగా జాతీయ స్థాయిలో పనిచేసన అనుభవం ఇందుకు కలిసొస్తుందని భావిస్తున్నారట.

రాష్ట్రంలోనే ఏకైక ముదిరాజు సామాజికవర్గ ఎమ్మెల్యే..

త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వరిస్తుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. కేబినెట్ విస్తరణలోనూ సామాజిక సమీకరణాలు, కొత్తవారికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే బలమైన సామజికవర్గంగా ఉన్న ముదిరాజ్ వర్గాన్ని పోలరైజ్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం ఆ వర్గానికి కేబినెట్‎లో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆ లోటు భర్తీ చేయాలంటే కాంగ్రెస్ ముందున్న ఏకైక ఆప్షన్ ఒక్క వాకిటి శ్రీహరి మాత్రమే. ముదిరాజ్ సామాజికవర్గం నుంచి రాష్ట్రంలోనే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనొక్కరే. దీనికి తోడు మహబూబ్‎నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ముదిరాజ్ ముద్దుబిడ్డను మంత్రిని చేస్తామని హామీ సైతం ఇచ్చారు. దీంతో మంత్రి విస్తరణలో వాకిటి శ్రీహరి మంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఇద్దరు నేతలను కీలక పదవులు ఊరిస్తున్నాయి. సామాజిక సమీకరణాలతో పాటు ఇరువురికి అధిష్టానం నేతలతో మంచి పరిచయాలు కలిసిరానున్నాయి. ఏఐసీసీ సెక్రటరీగా ఉన్న సంపత్ కుమార్ అధిష్టానం పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉండగా.. వాకిటీ శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఎలా చూసుకున్నా ఈ దఫా పాలమూరు జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని నేతలు, క్యాడర్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..