- Telugu News Photo Gallery Spiritual photos Do you know in which direction the dust bin should not be placed in the house according to Vastu Shastra?
వాస్తు టిప్స్ : మీ ఇంటిలో చెత్త బుట్ట ఈ దిశలో ఉంటే దరిద్రమే!
వాస్తు శాస్త్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు, ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. కానీ కొంత మంది మాత్రమే వాస్తు నియమాలు పాటిస్తారు, ఇక వీటిని విస్మరించిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే మనం రోజూ వేసే చెత్త బుట్ట విషయంలో కూడా తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. అవి ఏవో చూద్దాం.
Updated on: Dec 22, 2025 | 8:36 AM

వాస్తు శాస్త్రం ప్రకారం, చెత్త బుట్ట అంటే చాలా మంది ఎక్కువగా పట్టించుకోరు. దీనిని ఇంటిలో ఏదో ఒక మూలన పెడుతుంటారు. కానీ మనం వేసే చెత్త బుట్ట కూడా మన ఇంటిలో సానుకూల శక్తిని నింపుతుందంట. అందుకే దీనిని ఎప్పుడూ తప్పుడు దిశలో పెట్టకూడదు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి లోపల చెత్త బుట్టను ఈశాన్యం లేదా వాయువ్య దిశలో పెట్టడం అస్సలే మంచిది కాదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఈ దిశలు దేవతలతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ రెండు దిశల్లో చెత్త బుట్ట పెట్టడం వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయంట.

అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో చెత్త బుట్టను ప్రధాన ద్వారం వద్ద లేదా బాత్ రూమ్ వద్ద పెట్టకూడదంట. దీని వలన అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ప్రధాన ద్వారం లేదా బాత్ రూమ్ వద్ద చెత్త బుట్టను పెట్టడం అశుభకరంగా భావిస్తారంట. ఇంటిలోపల గొడవలకు కారణం అవుతుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశించాలి అంటే, ఎప్పుడైనా సరే చెత్త బుట్టను పశ్చిమం లేదా నైరుతి దిశలో పెట్టడం చాలా శుభప్రదం. దీని వలన ఇంటిలోపల ప్రతికూల శక్తి తగ్గిపోయి, శాంతి నెలకొంటుందంట. ఇది కుటుంబం పై సానుకూల ప్రభావం చూపుతుందంట.