Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..
సాధారణంగా సినీరంగంలోకి చాలా మంది తారలు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తారు. ఎన్నో హిట్స్ అందుకుని ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. వారిలో సీనియర్ నటి శ్రీలక్ష్మి ఒకరు. తెలుగులో టాప్ లేడీ కమెడియన్లలో ఆమె ఒకరు.

తెలుగు సినిమా ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో శ్రీలక్ష్మి ఒకరు. దాదాపు 500లకు పైగా సినిమాలు.. సీరియల్స్ చేసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఇప్పటికీ సినీరంగంలో యాక్టివ్ గా ఉన్నారు. చాలా సంవత్సరాలుగా తెలుగు సినీరంగంలో సత్తా చాటిన టాప్ లేడీ కమెడియన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మేల్ కమెడియన్స్ డామినేషన్ పెరుగుతున్న సమయంలో అడుగుపెట్టి తన కామెడీ టైమింగ్, నటనతో అలరించింది శ్రీలక్ష్మి. ఆమె నటించిన సినిమాల్లో ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ చంటబ్బాయ్. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంలో ఆమె తన నటనతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. తెరపై ఆమె చెప్పే కవితల విధానం చూస్తే ఇప్పటికీ పెదవులపైకి చిరునవ్వు వచ్చేస్తుంది. అలాగే తెలుగులో శ్రీవారికి శుభలేఖ, కలెక్టర్ గారి అబ్బాయి, బంధువులొస్తున్నారు జాగ్రత్త, మాయలోడు, శుభలగ్నం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి : Actress : ఎక్కువగా కనిపించాలని ఆ డైరెక్టర్ ప్యాడింగ్ చేసుకోమన్నాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక వందల చిత్రాల్లో నటించి మెప్పించారు శ్రీలక్ష్మి. ఇటీవలే కమిటీ కుర్రవాళ్లు సినిమాలోనూ నటించి మెప్పించారు. ఇదెలా ఉంటే.. మీకు తెలుసా.. ఈ నటి మేనకోడలు దక్షిణాదిలో తోపు హీరోయిన్. తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. తెలుగులో ఓ స్టార్ హీరోతో నటించి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
నటి శ్రీలక్ష్మి తమ్ముడు రాజేశ్.. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరో. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పలు కారణాలతో సినిమాలకు దూరమయ్యాడు. తర్వాత అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మరణించారు. పల్లెటూరి మొనగాడు, రెండు రెళ్ల సీత, బొబ్బిలి బ్రహ్మాన్న వంటి చిత్రాల్లో నటించాడు. రాజేశ్ మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండగా.. ఇప్పుడు ఆయన కూతురు ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవలే వెంకటేశ్ జోడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది. ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..








