AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధానమంత్రి మోదీకి న్యూజిలాండ్ ప్రధాని ఫోన్ కాల్.. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం!

ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరో ప్రధాన దౌత్య విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా కీలక ఒప్పదం కుదిరింది. భారతదేశం-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను సంయుక్తంగా ప్రకటించారు.

ప్రధానమంత్రి మోదీకి న్యూజిలాండ్ ప్రధాని ఫోన్ కాల్.. రెండు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం!
Piyush Goyal - PM Narendra Modi - PM Christopher Luxon
Balaraju Goud
|

Updated on: Dec 22, 2025 | 1:05 PM

Share

ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరో ప్రధాన దౌత్య విజయాన్ని సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా కీలక ఒప్పదం కుదిరింది. భారతదేశం-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను సంయుక్తంగా ప్రకటించారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాన్ని పెంచడమే కాకుండా, అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాల నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయ ప్రపంచ భాగస్వామ్యాలను కూడా బలోపేతం చేస్తుంది.

భారతదేశం – న్యూజిలాండ్ మధ్య FTAపై చర్చలు మార్చి 2025లో ప్రధానమంత్రి లక్సన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ప్రారంభమయ్యాయి. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేయడం, రెండు దేశాల మధ్య రాజకీయ సంకల్పం, వ్యూహాత్మక అవగాహనను ప్రదర్శిస్తుంది. FTA అమలు తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలలో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. ఇది భారతదేశం – న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, వస్తువుల సరఫరా సహకారానికి కొత్త ఊపును అందిస్తుంది.

పెట్టుబడులకు భారీ బూస్ట్

ఈ ఒప్పందం ప్రకారం, న్యూజిలాండ్ రాబోయే 15 సంవత్సరాలలో భారతదేశంలో 20 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. ఈ పెట్టుబడి వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్, విద్య, సాంకేతికత, స్టార్టప్‌ల వంటి రంగాలలో అవకాశాలను సృష్టిస్తుంది. ఇక FTA అమల్లోకి వచ్చిన వెంటనే భారత్ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే 100% ఎగుమతులపై జీరో డ్యూటీ వర్తించనుంది. దీని వల్ల రైతులు, MSMEs, కార్మికులు, కళాకారులు, మహిళా వ్యాపారాలు, యువతకు లాభం చేకూరుతుంది. వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, లెదర్, ఫుట్‌వేర్ వంటి కార్మికాధారిత రంగాలతో పాటు, ఇంజినీరింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, కెమికల్స్ రంగాలకు కూడా పెద్ద అవకాశాలు లభించనున్నాయి.

భారతదేశం ఏడవ ప్రధాన FTA, గ్లోబల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుంది. న్యూజిలాండ్‌తో ఈ ఒప్పందం గత కొన్ని సంవత్సరాలలో భారతదేశం ఏడవ ప్రధాన FTA. గతంలో, భారతదేశం ఒమన్, UAE, UK, ఆస్ట్రేలియా, మారిషస్, EFTA (యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ బ్లాక్) దేశాలతో ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ సిరీస్ భారతదేశం విశ్వసనీయ ప్రపంచ వాణిజ్య కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

భారత్ ఎగుమతులకు భారీ ఊరట

ఈ అగ్రిమెంట్‌‌పై హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలో, న్యూజిలాండ్ మంత్రి టాడ్ మెక్‌క్లేతో సన్నిహిత సహకారంతో ఈ FTA పూర్తయిందని పీయూష్ గోయల్ తెలిపారు. ఇది ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయి అని అన్నారు. ఇదే భారత్ ఎగుమతులకు భారీ ఊరట అని పేర్కొన్నారు.

రైతులకు కొత్త మార్కెట్లు

పండ్లు, కూరగాయలు, కాఫీ, మసాలాలు, ధాన్యాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు న్యూజిలాండ్ మార్కెట్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పార్ట్‌నర్‌షిప్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, న్యూజిలాండ్ ఆధునిక వ్యవసాయ సాంకేతికతల ద్వారా రైతుల ఆదాయం, ఉత్పాదకత పెరగనుంది. తేనె, కివీఫ్రూట్, ఆపిల్స్ వంటి హార్టికల్చర్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రోత్సాహం ఉంటుంది. దేశీయ సున్నిత అంశాలను దృష్టిలో పెట్టుకుని, డెయిరీ, షుగర్, కాఫీ, మసాలాలు, ఎడిబుల్ ఆయిల్స్, బంగారం–వెండి, కాపర్, రబ్బర్ ఆధారిత ఉత్పత్తులకు రక్షణ కల్పించినట్టు గోయల్ స్పష్టం చేశారు.

సేవల రంగం, యువతకు అవకాశాలు

IT, ఫైనాన్స్, విద్య, టూరిజం, నిర్మాణ రంగాలకు కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. హెల్త్, సంప్రదాయ వైద్యం, స్టూడెంట్ మొబిలిటీ, పోస్ట్-స్టడీ వర్క్‌పై న్యూజిలాండ్ తొలిసారి ప్రత్యేక అనెక్సులు చేర్చింది. 5,000 తాత్కాలిక ఉద్యోగ వీసాలు, వర్కింగ్ హాలిడే వీసాలు, పోస్ట్-స్టడీ వర్క్ మార్గాలతో భారత యువతకు గ్లోబల్ అవకాశాలు విస్తరించనున్నాయి. ఈ భారత్–న్యూజిలాండ్ FTA ద్వారా ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యం మరింత బలపడుతూ, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనకు ఇది కీలక అడుగుగా మారనుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..