AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ

గోవాలో సమీరా రెడ్డి అరటి పండ్లు.. అసలు కథ ఇదే అంటున్న ముద్దుగుమ్మ

Phani CH
|

Updated on: Dec 22, 2025 | 12:16 PM

Share

నటి సమీరా రెడ్డి తన పెరట్లో పండించిన పురుగుమందుల్లేని అరటిపండ్లు సహజంగా పక్వానికి రావడానికి వారం పట్టిందని వెల్లడించారు. మార్కెట్ పండ్లతో పోలిస్తే నాణ్యత, రుచిలో తేడాను వివరించారు. ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంట్లో పండించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, అరటి పువ్వు, కాండం వంటి వాటిని వంటల్లో ఉపయోగించడంపై ఆసక్తి చూపారు.

సహజసిద్ధంగా, ఎటువంటి పురుగుమందులు లేకుండా పండించిన అరటిపండ్లు పక్వానికి రావడానికి ఎంత సమయం పడుతుందో నటి సమీరా రెడ్డి స్వయంగా వివరించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను షేర్ చేసారు. సహజమైన పండ్ల రుచికి, నాణ్యతకు మధ్య ఉన్న తేడాను ఆమె స్పష్టంగా చెప్పారు. గోవాలోని తన ఇంటి పెరట్లో కాసిన అరటి గెల పండటానికి దాదాపు వారం పట్టిందని సమీరా రెడ్డి చెప్పారు. పురుగుమందులు వాడకపోవడం వల్లే ఇంత సమయం తీసుకుని, చక్కటి బంగారు రంగులోకి మారాయని ఆమె వివరించారు. ఈ పండ్ల రుచి చాలా బాగుందనీ పురుగుమందులు లేకపోవడం వల్లే ఇవి పండటానికి వారం పట్టిందనీ అరటి పువ్వు, కాండం వంటి వాటిని వంటల్లో ఎలా ఉపయోగించవచ్చో కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నట్లు ఆమె వీడియోలో తెలిపారు. ఆహార నాణ్యతపై ఆమె కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు. మార్కెట్లో దొరికే అరటిపండ్లు చాలా త్వరగా పాడైపోతాయన్నారు. వాటికి కచ్చితంగా పురుగుమందులు వాడి ఉంటారనీ మనం తినే ఆహారం ఎంత వరకు సురక్షితం అని ఆలోచించాల్సి వస్తోందనీ తెలిపారు. సహజంగా పండటానికి వారం పడుతుందన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది అని సమీరా రెడ్డి అన్నారు. ఇంట్లో పండ్లు, కూరగాయలు పండించడం మొదలుపెట్టాక, మనం తినే ఆహారంలో ఏం కలుస్తుందో అనే విషయంపై తనకు అవగాహన పెరిగిందని ఆమె తన పోస్ట్ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. గతంలో కూడా సమీరా రెడ్డి అరటి కాండం నీటి ప్రయోజనాల గురించి ఓ వీడియో షేర్‌ చేసారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్భుతం.. 108 అడుగుల జాంబవంతుడి విగ్రహం.. ఎక్కడో తెలుసా