AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వీధికుక్కల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు.. అధికారుల పనితీరుపై ఆగ్రహం..

తెలంగాణలో వీధి కుక్కల బెడదపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అంబర్‎పేట్‎కు చెందిన ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అలెర్ట్ అయి తీసుకోవాల్సిన చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది.

Telangana: వీధికుక్కల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు.. అధికారుల పనితీరుపై ఆగ్రహం..
Telangana High Court
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Jul 03, 2024 | 11:12 AM

Share

తెలంగాణలో వీధి కుక్కల బెడదపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఏడాది అంబర్‎పేట్‎కు చెందిన ప్రదీప్ అనే బాలుడు వీధి కుక్కల బారిన పడి మృతి చెందాడు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టు మరోసారి విచారించింది. ఇందులో భాగంగా కుక్కల దాడులను ఆపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను హైకోర్టు ప్రశ్నించింది. ఒక ఘటన జరిగిన వెంటనే అధికారులు అలెర్ట్ అయి తీసుకోవాల్సిన చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకొని అన్ని వీధి కుక్కలకు వ్యాక్సిన్ చేయించి ఉంటే మరో ప్రాణం బలి అయ్యేది కాదని హైకోర్టు వాఖ్యానించింది.

కొద్దిరోజుల క్రితం పటాన్ చెరువు వద్ద కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఆరు సంవత్సరాల విశాల్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో బాలుడు మరణించాడు. ఈ ఘటనలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్‎తో పాటు రెవెన్యూ వెటర్నరీ అధికారులను వారం రోజుల్లోపు నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. మొత్తం రాష్ట్రంలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయి? వీటిలో ఎన్నిటికి వ్యాక్సినేషన్ చేయించారు? అని హైకోర్టు ప్రశ్నించింది. అంబర్‎పేట్‎లో చనిపోయిన బాలుడికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎనిమిది లక్షల పరిహారం చెల్లించామని రాష్ట్రప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి కేవలం పరిహారం చెల్లిస్తే సరిపోతుందా అని ప్రశ్నించింది. అనిమల్ వెల్ఫేర్ బోర్డు ఇప్పటివరకు ఏం చేసిందో తెలుపాలని ప్రశ్నించింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎన్ని కుక్కలకు వ్యాక్సినేషన్ చేశారు అని నివేదికను కోరింది.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవటం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకవేళ తగు చర్యలు తీసుకుంటే మరో బాలుడు చనిపోయేవాడు కాదు కదా అని తెలిపింది. అసలు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అనుపం త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. భారతీయ అనిమల్ వెల్ఫేర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందిగా గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి రాష్ట్రంలోనూ అనిమల్ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేయాలి, వీధి కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేయాలి, ఇలాంటి చర్యలు ఎంతవరకు చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో జులై 10న నివేదిక సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..