AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు కూలీలు దుర్మరణం

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం ఇందారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మందికి గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు కూలీలు దుర్మరణం
Mancherial Road Accident
Balaraju Goud
|

Updated on: Dec 22, 2025 | 10:43 AM

Share

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జైపూర్ మండలం ఇందారం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

బొలొరో డ్రైవర్ కాలకృత్యాల కోసం రోడ్డు ప్రక్కన వాహనాన్ని ఆపడంతో వెనక నుండి బలంగా ఢికొట్టింది లారీ. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ప్రమాదానికి సంబంధించిన స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. మహారాష్ట్ర నుంచి 23 మంది కూలీలతో బొలొరో వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
ఉక్రెయిన్ బందీ నుంచి విడిపించండి.. గుజరాత్ విద్యార్థి వేడుకోలు!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
మీరు గోల్డ్‌ లోన్‌ తీసుకుంటున్నారా? రూల్స్‌ మరింత కఠినం!
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
కేకేఆర్ పెట్టిన ప్రతి పైసాకు న్యాయం చేసిన ముస్తఫిజుర్
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
సవాళ్లు స్వీకరించడం ఇష్టమంటున్న టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
ఫస్ట్ పార్ట్‌తోనే టెన్షన్ పెట్టేశారు.. సీక్వెల్‌ ప్లాన్ ఏంటో మరి?
అంత సపోర్ట్ చేశారు కదా.. చివరి క్షణంలో ఏమైందంటూ..
అంత సపోర్ట్ చేశారు కదా.. చివరి క్షణంలో ఏమైందంటూ..
విరాట్ కోహ్లీ డైట్‌లో ఉండే ఆ స్పెషల్ ఫుడ్ ఏంటో తెలుసా?
విరాట్ కోహ్లీ డైట్‌లో ఉండే ఆ స్పెషల్ ఫుడ్ ఏంటో తెలుసా?
ఒకేసారి భారీగా పెరిగిన చికెన్, కోడి గడ్ల ధరలు.. కారణం అదే..
ఒకేసారి భారీగా పెరిగిన చికెన్, కోడి గడ్ల ధరలు.. కారణం అదే..
ఇంత అందమేంటీ మేడమ్.. సీరియల్ బ్యూటీ గ్లామర్ సంచలనం..
ఇంత అందమేంటీ మేడమ్.. సీరియల్ బ్యూటీ గ్లామర్ సంచలనం..