- Telugu News Sports News Other sports YAI 38th Hyderabad Sailing Week 2024 multi class ranking event starts with winners getting chance in Asian Games
Hyderabad: హైదరాబాద్‌లో అట్టహాసంగా మొదలైన సెయిలింగ్ వీక్-2024 పోటీలు.. విజేతలకు గోల్డెన్ ఛాన్స్.. ఏంటంటే?
YAI 38th Hyderabad Sailing Week 2024: ఏటా గ్రాండ్‌గా హుస్సేన్ సాగర్‌లో నిర్వహించే సెయిలింగ్ పోటీలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకొవడంతో అసలు పోటీలు ఇక సమరాన్ని తలపించేలా సాగుతున్నాయి.
Updated on: Jul 03, 2024 | 1:27 PM

ఏటా గ్రాండ్‌గా హుస్సేన్ సాగర్‌లో నిర్వహించే సెయిలింగ్ పోటీలు ఈ ఏడాది కూడా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్‌లో ఇప్పటికే ట్రయల్స్ పూర్తి చేసుకొవడంతో అసలు పోటీలు ఇక సమరాన్ని తలపించేలా సాగుతున్నాయి.

హుస్సేన్ సాగర్‌లో వారం రోజులు సెయిలింగ్ పోటీలు కనువిందు చేయున్నాయి. ఈ నెల 7 వరకు జరిగే ఈవెంట్‌ను యాటింగ్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా, లేసర్ క్లాస్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నాయి.

లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సిధన పోటీలను ప్రారంభించారు. జాతీయ స్థాయిలో దాదాపు వంద మంది సెయిలర్స్ పాల్గొంటుండగా.. ఈ జాతీయ టోర్నమెంట్‌లో రాణించిన సెయిలర్స్‌ను ఏషియన్ గేమ్స్‌కు సెలెక్ట్ చేయనున్నట్లు మేజర్ జనరల్ అజయ్ శర్మ తెలిపారు.

లేసర్, లేసర్ స్టాండర్డ్‌లకి సంబంధించి మొత్తం 12 రేసులు జరుగుతాయని.. చివరి రోజనైన విజేతలను ప్రకటించి అవార్డులు అందజేశస్తారు.

జులై నుంచి ఆగస్టులో హైదరాబాద్ వెదర్ సెయిలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఏటా వందలాది పడవలు గాలివాటంతో హుస్సేన్ సాగర్ లో దూసుకుపోతు సందడి చేస్తాయి.

ఈసారి కూడా ఆ జోష్ ఏమాత్రం తగ్గకుండా 38 వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ప్రారంభమైంది. ఇక హూస్సేన్ సాగర్‌లో పోటీల దగ్గర నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ విద్యా సాగర్ అందిస్తారు.




