రుక్మిణి ప్రేమలో పడిందా? ఈ ఫొటోలో ఉన్నదెవరంటే? క్లారిటీ 

18 Januaryr2026

Basha Shek

Basha Shek

కాంతార 2 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన రుక్మిణి వసంత్  డేటింగ్ రూమర్లతో గత రెండు రోజులుగా వార్తలలో నిలుస్తోంది.

Basha Shek

చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉంటోన్న రుక్మిణి వసంత్ ఇటీవల ఒకరితో  చాలా చనువుగా ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Basha Shek

ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏంటి రుక్మిణి  కూడా రిలేషన్ లో ఉందా?అని ఆరాతీశారు.

Basha Shek

రుక్మిణీ అభిమానులు ఏకంగా బ్రోకెన్ హార్ట్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. దీంతో  ఈ డేటింగ్ వార్తలపై హీరోయిన్ టీం స్పందించింది.

Basha Shek

రుక్మిణి వసంత్ సిద్ధాంత్ నాగ్ (ఫొటోలోని వ్యక్తి) గురించి వస్తున్న డేటింగ్ వార్తలలో ఏమాత్రం నిజం లేదని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Basha Shek

రుక్మిణి వసంత్,  సిద్ధాంత్ ఇద్దరు మంచి స్నేహితులని సమాచారం. సిద్ధాంత్  ఫోటోగ్రాఫర్ గా పని చేస్తున్నట్టు సమాచారం.

Basha Shek

అంతేకాదు రుక్మిణి వసంత్, సిద్ధాంత్  నాగ్ తో  కలిసి దిగిన ఈ ఫోటో 2023వ సంవత్సరానికి సంబంధించినదని తెలుస్తోంది.

Basha Shek

మొత్తానికి రుక్మిణీ వసంత్ డేటింగ్ వార్తలలో నిజం లేదని క్లారిటీ రావడంతో ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.