ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సమ్మక్క సారక్క నూతన గద్దెల ప్రారంభోత్సవంతో పాటు, రాష్ట్ర పాలనపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మంత్రులు, అధికారుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక పర్యటనకు పటిష్టమైన భద్రత కల్పించారు.