Viral video: వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే మటాషే! రీల్స్ పిచ్చితో మెట్రోతో వింతవేశాలు..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత ప్రమాదకర స్టంట్స్ చేయడం ఇప్పుడు తెగ ఫ్యాషన్ అయిపోయింది. తాము ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామనే విషయం కూడా మరిచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వీడియో తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మెట్రోలో ఇద్దరు మహిళలు చేసిన స్టంట్‌కు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదేంటో చూద్దాం పదండి.

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఈ మధ్య చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే.. మరికొందరు పబ్లిక్ ప్లేస్‌లలో వికృతచేష్టలు చేస్తూ జనాలను ఇబ్బందుకుల గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తాజాగా ఇలానే మెట్రోలో ప్రమాదకర రీల్స్ చేశారు. ఇద్దరు మహిళలు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..ఒక మెట్రో స్టేషన్ లో మెట్రో ట్రైన్ ఆగి ఉంది. ఆ మెట్రోలో ఒక యువతి డోర్ దగ్గర నిలబడి ఉండగా.. మరో యువతి ట్రైన్ మధ్యలో పోల్స్ పట్టుకొని నిలబడి ఉంది. అయితే ట్రైన్ డోర్ ఓపెన్ అవ్వగానే మధ్యలో ఉన్న యువతి.. పోల్స్ సహాయంతో డోర్ దగ్గర ఉన్న యువతని వెనక నుంచి తన్నింది. దీంతో డోర్ దగ్గర నిల్చున్న యువతి స్టేషల్ ప్లాట్‌ఫామ్‌పై పడిపోయింది. ఆ తర్వాత ఆ యువతి లేచి నవ్వుకుంటూ మళ్లీ ట్రైన్ వచ్చింది. ఈ తంతంగాన్నంత పక్కనే ఉన్న వాళ్లకు తెలిసిన మరో ఫ్రెండ్ వీడియో తీశారు.
వీడియో చూడండి..
I saw this on Ig reels today… was shocked on how nobody from the metro stood up… some people shouldn’t be allowed in metros pic.twitter.com/p16WJukxaB
— Vaibhav Mishra (@memedox20) January 16, 2026
తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్ట్రా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 56 లక్షల లైక్స్ వేలల్లో వీవ్స్ వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ బాక్స్‌ను నింపేశారు. అదే సమయానికి ట్రైన్ కదిలిఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నని.. రీల్స్ పిచ్చితో మరీ ఇలాంటి పనులు చేయడమేంటని మండిపడ్డారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
