పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం అంబడిపూడిలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నగరాల నుంచి వచ్చిన అతిథులు, స్థానిక వనితలతో కలిసి వినూత్న పోటీల్లో పాల్గొని గ్రామాన్ని ఒక మినీ స్టేడియంగా మార్చేశారు. ముఖ్యంగా మహిళల కోసం నిర్వహించిన 'కొబ్బరికాయ విసిరే పోటీ' అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోటీలో భాగంగా కొబ్బరికాయను చేత్తో కాకుండా కాలితో దూరంగా విసరాలి. గీత గీసిన చోట నిలబడి, వెనక్కి తిరిగి చూడకుండా కాలితో కొబ్బరికాయను ఎవరు ఎక్కువ దూరం విసురుతారో వారే విజేతలు. ఈ వెరైటీ పోటీలో పట్నం నుంచి వచ్చిన మహిళలు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొని, పల్లె వనితలకు గట్టి పోటీ ఇచ్చారు.
మరోవైపు మహిళల బాహుబలాన్ని పరీక్షించేలా ‘ఇటుక మోసే పోటీ’ సాగింది. మోచేయి వంచకుండా, కేవలం ఒక చేత్తో బరువైన ఇటుకను పట్టుకుని మహిళలు తమ పట్టుదలను ప్రదర్శించారు. పట్నం సోకులు.. పల్లెటూరి పట్టుదల మధ్య సాగిన ఈ పోటీలో ఎవరు ఎక్కువ సేపు నిలబడతారో అని గ్రామస్తులంతా ఉత్కంఠగా తిలకించారు. ఇక అసలైన సమరం తాడులాగుడు దగ్గర మొదలైంది పట్టణ మహిళలు ఒక జట్టుగా, పల్లెటూరి మహిళలు మరో జట్టుగా విడిపోయి.. ‘గెలుపు మాదంటే మాదే’ అంటూ తాడును లాగారు. పోటీదారులను ఉత్సాహపరుస్తూ స్థానికులు చేసిన కేరింతలు, ఈలలతో అంబడిపూడి వీధులన్నీ మార్మోగిపోయాయి. పట్నం నుంచి వచ్చిన వారు తమ హోదాను పక్కనపెట్టి, పల్లెటూరి మట్టిలో కలిసి ఆడుతూ నిజమైన సంక్రాంతి ఆనందాన్ని పొందారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
రైలు కంపార్ట్మెంట్లో భయానక దృశ్యం!
బంగారంతో పోటీపడుతున్న పులస..
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!

