మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
రెండేళ్లకోసారి జరిగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సమ్మక్క, సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు. ఇక మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది.
కేవలం 299 రూపాయలు చెల్లిస్తే.. అమ్మవార్ల ప్రసాదాన్ని నేరుగా మీ ఇంటికే అందించే సౌకర్యాన్ని కల్పించింది. ఈ ప్రసాదం కిట్‌లో అమ్మవార్ల ఫోటో, పసుపు, కుంకుమ, బంగారం ఉంటాయి. భక్తులు ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా కానీ, సమీపంలోని కార్గో కౌంటర్లలో ఈ ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. దేవాదాయ శాఖ సహకారంతో జనవరి 28 నుండి 31 వరకు జరిగే జాతర సమయంలో ఈ పంపిణీ జరుగుతుంది. భక్తుల నమ్మకాన్ని, భక్తిని గౌరవిస్తూ ప్యాకింగ్ విషయంలో మరియు డెలివరీ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని సంస్థ ప్రకటించింది. మరింత సమాచారం కోసం టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ 040-69440069, 040-23450033ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.ప్రసాదం పంపిణీతో పాటు, జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ దాదాపు 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నేరుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారంలో తాత్కాలిక బస్టాండ్లను నిర్మించి.. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

