వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసుఫ్ గూడలో ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలిపోయింది. తొలుత మెషిన్ నుంచి మంటలు వచ్చాయని, కాసేపటికే భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని ఆ ఇంట్లో వాళ్లు చెప్పారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాషింగ్ మెషిన్ దగ్గర్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మెషిన్ పేలుడుకు ఆ గదిలోని పలు వస్తువులు దెబ్బతిన్నాయని, వాషింగ్ మెషిన్ మొత్తం తుక్కుతుక్కుగా మారిందని వివరించారు.
యూసుఫ్ గూడ పరిధిలోని కృష్ణానగర్ లో సయ్యద్ గౌస్ కు రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ లోని పోర్షన్ ను అద్దెకు తీసుకున్న సాంబశివారెడ్డి అనే వ్యక్తి.. అందులో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా అందులో నుంచి మంటలు వచ్చాయి. కాసేపటికే పొగతోపాటు పెద్ద శబ్దంతో వాషింగ్ మెషిన్ పేలిపోయింది. వాషింగ్ మెషిన్ ముక్కలుముక్కలైంది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఘటన సమయంలో వాషింగ్ మెషిన్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
వైరల్ వీడియోలు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!

