అమెరికాలో ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. మిన్నెసోటాలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తూ పట్టుబడ్డారు. దీనివల్ల వారి వీసాలు రద్దయ్యే, స్వదేశానికి పంపించే ప్రమాదం ఉంది. US నిబంధనల ప్రకారం, ఎఫ్-1 వీసాదారులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీలులేదు, ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి.