నల్లని ఆవాలతో ఆరోగ్యం.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?

Samatha

20 January 2026

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే పోపు దినుసుల్లో ఆవాలు తప్పనిసరి. నల్ల ఆవాలు లేని వంటిల్లు ఉండనే ఉండదు. ఇవి వంటల్లో తప్పకుండా వేస్తారు.

వంటిల్లు

అయితే నిత్యం వంటల్లో ఉపయోగించే నల్లని ఆవాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

నల్లని ఆవాలు

ఆవాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు, విటమిన్స్, కాల్షియం, ఐరన్, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్స్

బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది చాలా బెస్ట్. ఆవాలను ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వలన త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉన్నదంట.

బరువు నియంత్రణ

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. ఆవాలలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన ఇది మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ

గుండె ఆరోగ్యానికి కూడా ఆవాలు చాలా మంచివని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మంచి కొలెస్ట్రాల్ పెంచి, గుండెను కాపాడుతాయి.

గుండె ఆరోగ్యానికి

నల్ల ఆవాలలో యాంటీ ఇన్ ఫ్లమేంటరీ గుణాలు ఎక్కువగా ఉండటం వలన ఇవి కడుపులో మంట, అర్థరైటీస్ వంటి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

కీళ్ల నొప్పులు

ప్రతి రోజూ మీరు మీ ఆహారంలో ఆవాలను చేర్చుకోవడం వలన ఇవి రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.

రోగనిరోధక శక్తి