Medaram Sammakka Sarakka Jathara 2026: మేడారం జాతరకు రాలేకపోయిన భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ అందించింది. దేవాదాయ శాఖ సహకారంతో కేవలం ₹299కే అమ్మవారి ప్రసాదాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవచ్చు. ఈ సేవ ద్వారా సమ్మక్క సారలమ్మ ప్రసాదం, పసుపు కుంకుమలు నేరుగా మీ గడప వద్దకే చేరతాయి.