AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ‘బీజేపీ గెలవకూడదనేదే తమ లక్ష్యం’.. ఆ ఎన్నికలపై కొనసాగుతున్న మాటల యుద్దం..

తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల క్యాంపెయిన్‌ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి.

Telangana: 'బీజేపీ గెలవకూడదనేదే తమ లక్ష్యం'.. ఆ ఎన్నికలపై కొనసాగుతున్న మాటల యుద్దం..
Congress Cpi Cpm
Srikar T
|

Updated on: May 25, 2024 | 2:51 PM

Share

తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల క్యాంపెయిన్‌ చివరి దశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ప్రతిభకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్‌రెడ్డి. గెలిపిస్తే నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తానన్నారు. కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ తన అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను బరిలోకి దించింది. ఇదిలా ఉంటే తాము కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని చెబుతోంది బీజేపీ. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి కూడా అదే శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే కొందరు నేతలు విమర్శలు బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు గుప్పిస్తున్నారు.

జీవో నెంబర్‌ 46పై కేటీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌. ఈ సమస్యను సృష్టించిందే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమనీ.. తాము ప్రతిపక్షంగా పోరాడితే మంత్రిగా కేటీఆర్‌ వ్యంగమైన వ్యాఖ్యలతో ఎద్దేవా చేశారనీ విమర్శించారు. పదేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకోని బీఆర్‌ఎస్‌నేతలకు ఇప్పుడు వారిగురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఇదే తరుణంలో బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పట్టభద్రుల ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. మందు, డబ్బులు పంచి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు.

పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటెయ్యాలనీ ప్రజలపక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. నల్గొండలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఇక కమ్యూనిస్టులు గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీలు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని సీఎంకి మాట ఇచ్చాం అన్నారు కూనంనేని సాంబశివరావు. అలాగే బీజేపీ గెలవకూడదనేదే తమ లక్ష్యం అని అన్నారు. ఇలా నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం ఎవరిదో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..