AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి ఎవరు? రేసులో ముందున్న నేతలు వీరే..

తెలంగాణలో టీపీసీసీ పదవి రేసులో చాలా మంది నేతలు అధిష్టానం వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్ష పదవిపై చాలా మంది నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డినే కొనసాగించింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి ఎవరు? రేసులో ముందున్న నేతలు వీరే..
Telangana Congress
Srikar T
|

Updated on: May 25, 2024 | 2:56 PM

Share

తెలంగాణలో టీపీసీసీ పదవి రేసులో చాలా మంది నేతలు అధిష్టానం వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో టీపీసీసీ అధ్యక్ష పదవిపై చాలా మంది నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో టీపీసీసీ చీఫ్ గా సీఎం రేవంత్ రెడ్డినే కొనసాగించింది కాంగ్రెస్ అధిష్టానం. పైగా పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గానూ 14 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టార్గెట్ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. దీంతో అన్నీతానై ప్రచార బాధ్యతలు నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆ ఎన్నికలు ముగిసి 10 రోజులు గడిచిపోయింది. ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4న రానున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పదవీ బాధ్యతల నుంచి సీఎం రేవంత్ నిష్క్రమించే అవకాశం ఉంది. ఇకపై కేవలం పరిపాలనా సంబంధిత విషయాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖాళీ అయ్యే పదవి రేసులో అరడజనుకు పైగా నేతలపేర్లు వినిపిస్తున్నాయి.

ముందుగా డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క కూడా టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటక ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి సిద్దరామయ్యకు కేటాయించే తరుణంలో డిప్యూటీ సీఎంతో పాటు కర్ణాటక అధ్యక్షుని పదవీ బాధ్యతలు కూడా డీకే శివకుమార్‎కు కేటాయించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ పదవిపై జగ్గారెడ్డి కూడా గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన తరుణంలో ఏదైనా పార్టీ బాధ్యతలు కేటాయించాలన ఆశగా ఉన్నారు. అందులో భాగంగానే ఈ అధ్యక్ష్యపదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ జాబితాలో వినిపిస్తున్న మరో పేరు పొన్నం ప్రభాకర్. ఈయనకు ప్రస్తుతం తెలంగాణ క్యాబెనెట్‎లో స్థానం కల్పించారు. అయితే తాను స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉన్నప్పటి నుంచే ఈ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నానని అందుకే అధ్యక్షుని బాధ్యతలు కేటాయిస్తే పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని అధిష్టానానికి తెలిపినట్లు సమాచారం.

ఇలా కాకుండా బీసీ, ఎస్సీ సామాజిక వర్గానికి ఈ పదవి ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తే.. మధుయాష్కీ గౌడ్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌ కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా బీసీలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ కులగణన చేస్తామని చెప్పిన మాటపై కట్టుబడి ఉండేందుకు ఈ పదవిని బీసీ నాయకుడికి ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇలా ఎవరికి వారే కీలక నేతలు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షపదవిపై ఆశలు పెట్టుకోవడంతో ఈ సీటు ఎవరికి వరిస్తుందా అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని స్పష్టమైన ప్రకటన వెలువరిచే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..