Hyderabad: సాఫ్ట్‌వేర్ వివాహిత మర్డర్ కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే వాస్తవాలు..!

పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు.

Hyderabad: సాఫ్ట్‌వేర్ వివాహిత మర్డర్ కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే వాస్తవాలు..!
Software Murder Case
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 25, 2024 | 12:44 PM

చిన్న గొడవ నేపథ్యంలో భార్యను అత్యంత దారుణంగా కత్తితో హత్య చేశాడు ఓ భర్త.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోయాలని పథకం వేశాడు. కుదరక ఇంట్లోనే గ్యాస్ సిలిండర్ లీక్ చేసే ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆత్మహత్య డ్రామా ఆడాడు. ఇదంతా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన సాఫ్ట్‌వేర్ వివాహిత హత్య కేసు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్ మహానగరం శివారు బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన మధులతకు అదే జిల్లాకు చెందిన నాగేంద్ర భరద్వాజ్‌తో 2020లో వివాహం జరిగింది. వారికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. మీరు బాచుపల్లిలోని సాయిల్ అనురాగ్ కాలనీలో ఎమ్మెస్సార్ ప్లాజాలో నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

అయితే పెళ్లయిన మొదటి రోజు నుండి మొదలైన చిత్రహింసలు ఆమె మరణం దాకా కొనసాగినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. కనీసం కుమారుడు పుట్టినా, చూడడానికి కూడా వెళ్లలేదట. ఆ తర్వాత పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు మాట్లాడించిన నాగేంద్ర తీరు మాత్రం మారలేదు. ఇక మే నెల 4వ తేదీన మధులతను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి బాచుపల్లి పోలీసులకు దొరికిపోయాడు.

భార్యను హత్య చేసి ముక్కలు చేయాలి అని పథకం పన్నాడు నాగేంద్ర. ఫలించకపోవడంతో హత్య చేసిన గదిలో సిలిండర్‌ ఉంచి మరో సిలిండర్ కిచెన్‌లో పెట్టాడు. పవర్ ప్లగ్ పెట్టి వైర్లను సిలిండర్ వద్ద ఉంచి సిలిండర్ బ్లాస్ట్ అయినట్లుగా పోలీసులను తప్పుదోవ పట్టిందామని చూశాడు. అనంతరం తాళం వేసి కుమారుడితో సహా చందానగర్‌లోని స్నేహితుడు శ్రీనివాస్ ఇంటికి వెళ్ళాడు. విషయాన్ని అతనికి చెప్పి తన ఛాతిని కత్తితో పోడుచుకున్నాడు. దీంతో భరద్వాజ్‌ను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ మధులత మరణాన్ని అననుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు తావిస్తోందని, నాగేంద్ర భరద్వాజ్‌ను కఠినంగా శిక్షించాలని మధులత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…