Telangana: అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు ఇవే..

తెలంగాణలో జూన్ నెల 12 నుంచి ప్రారంభం కానున్న 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ఈ రోజు విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23న ముగియనున్నాయి.

Telangana: అకడమిక్ క్యాలెండర్‌ విడుదల.. స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు ఇవే..
Telangana Schools
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 25, 2024 | 4:09 PM

తెలంగాణ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. 1 నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం మే 25 శనివారం రిలీజ్ చేసింది.  ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23న ముగియనున్నాయి.  2025 ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. ప్రతి రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు 5 నిమిషాలు యోగా, మెడిటేషన్ క్లాసులు ఉండనున్నాయి.

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-1 ఎగ్జామ్స్ ను ఈ ఏడాది జూలై 31 లోగా, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 లోగా, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 28 వరకు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్‌ 12 లోపు, ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను 2025 జనవరి 29 లోపు, సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-2 పరీక్షలను 2025 ఏప్రిల్‌ 9 నుంచి 2024 ఏప్రిల్‌ 29 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్‌ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 28లోపు, SSC బోర్డు పరీక్షలను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..