Hyena Attack: మూడు రోజుల్లో రెండు సార్లు దాడి.. రైతులను భయపెట్టిస్తున హైనా..!

జీవాల (గొర్రెలు, మేకల) మందల కాపరులను హైనా భయబ్రాంతులకు గురి చేస్తోంది. జీవాలను బాయిల వద్ద విడిచి వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు రైతులు. మొన్నటికి మొన్న హైనా దాడిలో 65 గొర్రెలు మృతి చెందగా, 20 జీవాలకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

Hyena Attack: మూడు రోజుల్లో రెండు సార్లు దాడి.. రైతులను భయపెట్టిస్తున హైనా..!
Hyena Attack
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 25, 2024 | 1:40 PM

జీవాల (గొర్రెలు, మేకల) మందల కాపరులను హైనా భయబ్రాంతులకు గురి చేస్తోంది. జీవాలను బాయిల వద్ద విడిచి వెళ్ళడానికి ధైర్యం చేయడం లేదు రైతులు. మొన్నటికి మొన్న హైనా దాడిలో 65 గొర్రెలు మృతి చెందగా, 20 జీవాలకు తీవ్ర గాయాలైన సంఘటన మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్‌లో గురువారం చోటు చేసుకుంది. తాజాగా మళ్ళీ నిన్న రాత్రి కూడా అదే గ్రామంలో మేకల పై దాడి చేసింది హైనా.. దీంతో రాత్రి అయిందంటే చాలు తమ జీవాల పై హైనా ఎక్కడ దాడి చేస్తుందో అని వణికి పోతున్నారు రైతులు.

మాచాపూర్‌ గ్రామానికి చెందిన రైతు పున్నం మల్లయ్య తన వ్యవసాయ బావి వద్ద జీవాల మంద కోసం ఇనుప జాలితో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశాడు. మల్లయ్య రోజు మాదిరిగానే జీవాలను మేత మేపి ఫెన్సింగ్‌లోనికి వాటిని పంపించి ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం తెల్లవారుజామున బావి దగ్గరికి వచ్చిన మల్లయ్య గొర్రెలు, మేకలు కలిపి 65 మృతి చెందగా, మరో 20 జీవాలకు తీవ్ర గాయాలై ఉన్నాయి. తనకు జీవనాధారమైన జీవాలు మృతి చెందడంతో రైతు బోరున విలపించి, వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్‌ అధికారులు మూగ జీవాలను పరిశీలించారు.

చుట్టూ పక్కల దాడి చేసిన జంతువు పాదముద్రలను సేకరించి జీవాలపై దాడి చేసింది హైనాగా గుర్తించారు. రాత్రి వేళలో ఘటన స్థలంలో ట్రాఫ్‌ కెమెరాలతో పాటు, బోను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కాగా మృతి చెందిన జీవాల విలువ సుమారు రూ. 5.50 లక్షలు ఉంటుందని రైతులు తెలిపారు.

ఇది జరిగి రెండు రోజులు కాగానే మళ్ళీ రాత్రి హైనా దాడిలో రెండు మేకలు మృతి చెందగా, మరో 5 జీవాలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఫారెస్ట్ అధికారులు వెంటనే హైనాను బంధించాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…