Astro Tips: ఈ చెడు అలవాట్లు ధనవంతులను కూడా పేదలను చేస్తాయి.. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు

ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిల్వవక పొతే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెలిసి లేదా తెలియక మనం చేసే పనుల్లో కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. దినచర్యలో అలాంటి కొన్ని రకాల అలవాట్ల ప్రతికూల శక్తిని పెంచుతుంది. అప్పుడు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదు. కనుక చెడు అలవాట్లలో కొన్నింటిని మెరుగుపరచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Astro Tips: ఈ చెడు అలవాట్లు ధనవంతులను కూడా పేదలను చేస్తాయి.. ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు
Astro Tips
Follow us

|

Updated on: May 25, 2024 | 2:27 PM

కొంతమంది చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా చేతిలో డబ్బులు నిలవవు. కొన్ని సార్లు అకస్మాత్తుగా ఖర్చులు కూడా తలెత్తవచ్చు. అప్పుడు సంపాదించిన డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇలా ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం జీవితంలోని కొన్ని అలవాట్లు కూడా కారణం కావొచ్చు కూడా. మీకు కూడా ఇలా ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిల్వవక పొతే కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తెలిసి లేదా తెలియక మనం చేసే పనుల్లో కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. దినచర్యలో అలాంటి కొన్ని రకాల అలవాట్ల ప్రతికూల శక్తిని పెంచుతుంది. అప్పుడు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించదు. కనుక చెడు అలవాట్లలో కొన్నింటిని మెరుగుపరచుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

ఇంట్లో శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి

మనం నివసించే ప్రదేశం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ధూళి ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదని పురాణాల నమ్మకం. ఇంట్లో ఏ మూల మురికి ఉంచకుండా శుభ్రం చేసుకోవాలి. ఇది కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి

ప్రస్తుతం యువతీయువకుల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. చాలా మంది రాత్రి పొద్దుపోయే వరకు మెలకువగా ఉంటారు. దీంతో తెల్లవారి తొమ్మిది పది గంటలు అయినా సరే బెడ్ మీద నుంచి తిరగకుండా నిద్రపోతారు. ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు వాస్తు శాస్త్రంలో ప్రతికూలంగా కూడా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేవాలి. ఇలా చేయడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఉదయం ఆలస్యంగా నిద్రలేస్తే అది దురదృష్టాన్ని కలిగిస్తుంది.

రాత్రిపూట ఖాళీ పాత్రలను ఉంచవద్దు

చాలా సార్లు రాత్రి భోజనం చేసిన తర్వాత బద్దకంతో ఆ వంట పాత్రలను అలాగే వదిలి ఉదయం వాటిని శుభ్రం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో ఇంట్లో ఖాళీ పాత్రలు ఉంచడం లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురి చేస్తుంది. ఇంట్లో పేదరికం పెరుగుతుంది. ఇంటి శుభ్రతతో పాటు సొంత శుభ్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దంతాలు, గోళ్లు, జుట్టును ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు