కొబ్బరి కాయకు మూడు కన్నులు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక రీజన్ ఏమిటో తెలుసా..!

కొబ్బరికాయ ను నారికేళం అని కూడా అంటారు. కొబ్బరి కాయకు సంబంధించిన పురాణాల ప్రకారం ఒక నమ్మకం కూడా ఉంది. ఒకసారి శ్రీ మహా విష్ణువు లక్ష్మిదేవితో కలిసి భూమిపైకి వచ్చాడు.అప్పుడు లక్ష్మిదేవి కూడా తనతో పాటు కామధేనువు, కొబ్బరి చెట్టును భూమికి తీసుకువచ్చింది. మరొక నమ్మకం ప్రకారం భూమిపై పురాతన కాలంలో మానవులను, జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. ఈ బలి కార్యక్రమాన్ని ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు

కొబ్బరి కాయకు మూడు కన్నులు ఎందుకు ఉంటాయి..? దీని వెనుక రీజన్ ఏమిటో తెలుసా..!
Hindu Religious Rituals
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2024 | 3:00 PM

హిందూ మతంలో కొబ్బరికాయ చాలా ముఖ్యమైనది. పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కొబ్బరిని క్విన్సు అని కూడా అంటారు. పూజ లేదా మరేదైనా శుభకార్యాలలో కొబ్బరికాయను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఏదైనా శుభ కార్యం, కొత్త ఇల్లు, దుకాణం లేదా కొత్త వాహనం కొనుగోలు చేసినా కొబ్బరికాయను పగలగొట్టే సంప్రదాయం ఉంది. కొబ్బరికాయ త్రిమూర్తుల స్వరూపం అని.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నివసిస్తారని నమ్మకం. కొబ్బరి నీళ్లను ఇంట్లో చల్లడం వల్ల ప్రతికూల శక్తులన్నీ నశిస్తాయి అని విశ్వాసం. హిందూ సనాతన ధర్మంలో నమ్మకం ప్రకారం కొబ్బరికాయపై ఉండే మూడు కనులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలకు సంబంధించినవిగా ప్రజలు భావిస్తారు.

బలి ఆచరణను ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం

కొబ్బరికాయ ను నారికేళం అని కూడా అంటారు. కొబ్బరి కాయకు సంబంధించిన పురాణాల ప్రకారం ఒక నమ్మకం కూడా ఉంది. ఒకసారి శ్రీ మహా విష్ణువు లక్ష్మిదేవితో కలిసి భూమిపైకి వచ్చాడు.అప్పుడు లక్ష్మిదేవి కూడా తనతో పాటు కామధేనువు, కొబ్బరి చెట్టును భూమికి తీసుకువచ్చింది. మరొక నమ్మకం ప్రకారం భూమిపై పురాతన కాలంలో మానవులను, జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. ఈ బలి కార్యక్రమాన్ని ఆపడానికి కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే కొబ్బరికాయ రూపం మానవుని వలె పరిగణించబడుతుంది. కొబ్బరికాయను మనిషి పుర్రెతో పోలుస్తారు. అంతేకాదు కొబ్బరి పీచు పిలక.. మనిషి వెంట్రుకలా ఉంటుంది. దీంతో ఏదైనా ఆచార, సాంప్రదాయ వ్యవహారాల్లో జంతువులను లేదా మానవులను బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయను ఉపయోగించడం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

కొబ్బరికాయకు సంబంధించిన పౌరాణిక కథ

పురాణాల ప్రకారం పూర్వ కాలంలో సత్యవ్రత అనే రాజు పరిపాలించేవాడు. సత్యవ్రత రాజ్యంలో మహర్షి విశ్వామిత్ర నివసించేవాడు. ఒకసారి మహర్షి విశ్వామిత్రుడు తపస్సు చేయడానికి అడవులకు వెళ్ళాడు. అప్పుడు విశ్వామిత్రుడు సుదీర్ఘకాలం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో విశ్వామిత్రుడి కుటుంబం ఆకలితో, దాహంతో అడవిలో తిరగడం మొదలుపెట్టింది. ఈ కుటుంబాన్ని రాజు సత్యవ్రత్రుడు చూశాడు. తనతో పాటు మహర్షి విశ్వామిత్ర కుటుంబాన్ని తన ఆస్థానానికి తీసుకువచ్చి వారికి ఆకలి దప్పులు తీర్చి సేవను చేశాడు. కొంతకాలం తర్వాత విశ్వామిత్రుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, అతని కుటుంబ సభ్యులు రాజు చేసిన సేవ గురించి చెప్పారు.

మహర్షి విశ్వామిత్రుడు రాజు ఆస్థానానికి చేరుకుని రాజ సత్యవ్రతకు కృతజ్ఞతలు తెలిపాడు, అప్పుడు రాజు కృతజ్ఞత స్థానంలో తనకు ఒక వరం ఇవ్వమని అభ్యర్థించాడు. మహర్షి విశ్వామిత్రుడు రాజుకు కోరుకోమ్మనమని అనుమతి ఇచ్చాడు. అప్పుడు రాజు తాను జీవించి ఉండగానే స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నానని మహర్షితో చెప్పాడు. దీంతో విశ్వామిత్ర మహర్షి తన తపస్సు శక్తిని అంతా ధారబోసి నేరుగా స్వర్గానికి దారితీసే మార్గాన్ని సిద్ధం చేశాడు.

ఈ మార్గంలో సత్యవ్రతుడు స్వర్గానికి చేరుకున్నప్పుడు.. ఇంద్రుడు స్వర్గంలో అడుగు పెట్టిన సత్యవ్రతుడిని స్వర్గం నుంచి క్రిందికి నెట్టాడు. సత్యవ్రతుడు భూమిపై పడే సమయంలో విశ్వామిత్రుడిని ప్రార్దించాడు. మహర్షికి జరిగిన సంఘటన మొత్తాన్ని చెప్పాడు. అది విన్న విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చింది. అప్పుడు విశ్వామిత్రు మహర్షి తన తపశ్శక్తిని అంతా వెచ్చించి స్వర్గానికి, భూమికి మధ్యలో మరొక స్వర్గాన్ని సృష్టించాడు. ఇలా భూమికి, స్వర్గానికి మధ్య మరో స్వర్గాన్ని నిర్మించినప్పుడు ఇది ఒక స్తంభంతో భూమికి అనుసంధానించబడింది. ఆ తర్వాత ఆ స్తంభం కొబ్బరి చెట్టు కొమ్మగా మారిందని.. రాజు తల కొబ్బరికాయగా మారిందని ప్రతీతి. ఈ కారణంగా కొబ్బరికాయ ఆకారం మానవ పుర్రెను పోలి ఉంటుందని ఓ పురాణకథ

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు